Niharika: బాబాయి పవన్ కల్యాణ్ బాటలోనే.. పది గ్రామాలకు సాయం చేసిన నిహారిక.. అభిమానుల ప్రశంసలు

|

Sep 07, 2024 | 1:39 PM

ప్రముఖ నటి , నిర్మాత మెగా డాటర్ కొణిదెల నిహారిక బాబాయ్ వేసిన బాటలోనే నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాదిరిగానే కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయమందించిందీ మెగా డాటర్. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు నిహారికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి..

Niharika: బాబాయి పవన్ కల్యాణ్ బాటలోనే.. పది గ్రామాలకు సాయం చేసిన నిహారిక.. అభిమానుల ప్రశంసలు
Niharika Konidela
Follow us on

ప్రముఖ నటి , నిర్మాత మెగా డాటర్ కొణిదెల నిహారిక బాబాయ్ వేసిన బాటలోనే నడుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాదిరిగానే కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయమందించిందీ మెగా డాటర్. దీంతో మెగా అభిమానులు, నెటిజన్లు నిహారికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నీట మునిగింది. ఇప్పటికీ చాలా మంది బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇకి ఇప్పటికే మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరూ తమ వంతు సాయంగా వరద బాధితులకు విరాళం అందించారు. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా నిలిచింది. ఈ విషయాన్నిఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది

‘బుడవేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలే. నేను పుట్టిన పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా కూడా మా పెద్దవారు అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారు చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో అభిమానం ఉంది. ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మా బాబాయ్ పవన్ కల్యాణ్‌తో పాటు మా కుటుంబీకులంతా బాధితులకు అండగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను కూడా ఈ బృహత్కార్యంలో పాటు పంచుకోవాలనే ఉద్దేశంతో ఉడతా భక్తిగా వరద ముంపునకు గురైన ఒక పది గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ అని రాసుకొచ్చింది నిహారిక.

ఇవి కూడా చదవండి

వరద ముంపునకు గురైన 10 పంచాయతీలకు నిహారిక సాయం..

సెప్టెంబర్ 12 నుంచి ఓటీటీలో కమిటీ కుర్రోళ్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.