Varalakshmi Sarathkumar: డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్‏కు NIA నోటీసులు..

కేరళ రాష్ట్రంలోని విలన్జియం సమీపంలో డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో ఆ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆదిలింగం పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది... డ్రగ్స్ తో సంబంధం కలిగి ఉన్న ఆది లింగం కి ఇప్పటికే nia అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సినీనటి వరలక్ష్మికి పీఏగా పనిచేసిన ఆదిలింగం డ్రగ్స్ కేసులో ఇరుకోవడంతో డ్రగ్స్ కి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఏమైనా సంబంధాల ఉన్నాయా అన్న కోణంలో nia అధికారులు విచారణ చేయనున్నారు .

Varalakshmi Sarathkumar: డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్‏కు NIA నోటీసులు..
Varalakshmi Sarath Kumar
Follow us
Vijay Saatha

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 29, 2023 | 2:28 PM

తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ గారాలపట్టే వరలక్ష్మీ శరత్ కుమార్ కు కేరళ ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.. కేరళలో పట్టుబడ్డ డ్రగ్స్ కేసులో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎన్ ఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.. కేరళ రాష్ట్రంలోని విలన్జియం సమీపంలో డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో ఆ కేసులో కీలక నిందితులుగా ఉన్న ఆదిలింగం పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది… డ్రగ్స్ తో సంబంధం కలిగి ఉన్న ఆది లింగం కి ఇప్పటికే nia అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సినీనటి వరలక్ష్మికి పీఏగా పనిచేసిన ఆదిలింగం డ్రగ్స్ కేసులో ఇరుకోవడంతో డ్రగ్స్ కి వరలక్ష్మి శరత్ కుమార్ కి ఏమైనా సంబంధాల ఉన్నాయా అన్న కోణంలో nia అధికారులు విచారణ చేయనున్నారు .

సినీనటి వరలక్ష్మికి పిఏగా పనిచేసిన అది లింగం గతంలో అనేకసార్లు ఆమెకి డ్రగ్స్ ఇచ్చినట్టుగా nia అనుమానిస్తుంది .. డ్రగ్స్ అమ్మిన ద్వారా వచ్చిన డబ్బును సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా nia గుర్తించింది.. ఆయనకు సంబంధించిన అనేక విషయాలపై పూర్తిస్థాయిలో సమాచారం రాబట్టడం కోసమే అధికారులు వరలక్ష్మి శరత్ కుమార్ కి నోటీసులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

గతం లో చాలా మందికి నోటీసులు..

గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది డ్రగ్స్ కేసు విచారణ ఎదుర్కొన్నారు .టాలీవుడ్ డ్రగ్స్ లో అయితే 13 మంది సినిమా హీరో హీరోయిన్లు విచారణ ఎదుర్కొంటే ,బాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీనటి రకుల్ ప్రీత్ సైతం విచారణ ఎదుర్కొన్నారు .ఇప్పుడు తాజాగా కోలీవుడ్ కు సంబంధించిన ప్రముఖ హీరోయిన్ గా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ ని డ్రగ్స్ కేసులు పిలవడం సంచలనంగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.