AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరోయిన్స్‌తో అలాంటి పనులు.. అవి సరసాలుకావు అంటూ క్లారిటీ ఇచ్చిన హీరో

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. హీరోల పై అలాగే పలువురు సినీ ప్రముఖుల మీద చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ హీరో మీద సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. హీరోయిన్స్ తో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని, హీరోయిన్స్ ను ఇష్టమొచ్చినట్టు టచ్ చేస్తాడని చాలా ఆరోపణలు ఉన్నాయి.

హీరోయిన్స్‌తో అలాంటి పనులు.. అవి సరసాలుకావు అంటూ క్లారిటీ ఇచ్చిన హీరో
Hero
Rajeev Rayala
|

Updated on: Dec 26, 2024 | 9:46 AM

Share

సినిమా హీరోలు చాలా కలివిడిగా ఉంటారు. సినిమా షూటింగ్స్ లో ఎంతో సరదాగా సందడి చేస్తూ ఉంటారు. సినిమా యూనిట్ తో, అలాగే హీరోయిన్స్ తోనూ సరదాగా అల్లరి చేస్తూ ఉంటారు. అయితే ఓ హీరో మీద మాత్రం చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, హీరోయిన్స్ తో అణిచితంగా వ్యవహరిస్తాడు అని.. హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉంటాడని ఇలా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంతకూ ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.? ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్నాడు స్టార్ హీరోగా రాణిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. రీసెంట్ గా మరో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఇంతకూ అతను ఎవరంటే..

ఇది కూడా చదవండి : కామన్ మ్యాన్‌లా స్కూటీపై తిరుగుతున్న ఈ సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.? ఆయన చాలా ఫెమస్

బాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో వరుణ్ ధావన్. ఈ యంగ్ హీరో తన కోస్టార్ట్స్ తో మాట్లాడేటప్పుడు తరచుగా హద్దులు అతిక్రమిస్తాడని కొందరు ఆరోపిస్తున్నారు. గతంలో వరుణ్ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందులో అతను నటి కియారా అద్వానీ అనుమతి లేకుండా చెంపపై ముద్దు పెట్టుకున్నాడు. లైవ్ ఈవెంట్‌లో నటి అలియా భట్ నడుమును తాకాడు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడంతోపాటు వరుణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నటీమణులతో వరుణ్ ప్రవర్తన సరిగా లేదని చాలా మంది విమర్శించారు. ఇప్పుడు దీనిపై వరుణ్ స్వయంగా స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన్ను ఈ ప్రశ్న అడిగారు.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! స్టార్ హీరోయిన్స్ బీట్ చేసేలా అజిత్ కూతురు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

వరుణ్ మాట్లాడుతూ.. ‘నా కో స్టార్స్ తో నేను చాలా సరదాగా ఉంటాను. అయితే దాన్ని ఎవరూ తప్పుగా తీసుకోరు’ అని వరుణ్ ధావన్ అన్నాడు. ఈసారి కియారాతో ముద్దుల సన్నివేశం గురించి ప్రశ్నలు అడిగారు. దీనికి ఆయన సూటిగా సమాధానం ఇచ్చారు. ‘మేము ఆ ముద్దు గురించి ముందే ప్లాన్ చేసుకున్నాం. కియారా, నేను ఇద్దరం ఆ క్లిప్‌ని పోస్ట్ చేసాము. మేము ఆ వీడియోను కావాలనే షూట్ చేశాం. మేమిద్దరం ముందే నిర్ణయించుకున్నాం. కియారా చాలా మంచి నటి. ఆ ముద్దుల సీన్ ముందే ప్లాన్ చేసుకున్నది’ అని వరుణ్ క్లారిటీ ఇచ్చాడు. అలాగే ‘జగ్ జగ్ జియో’ ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరుణ్ కియారా నడుము పట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లోకి నెట్టడం పై వరుణ్ మాట్లాడుతూ.. ‘ఇది ముందుగా ప్లాన్ చేయలేదు. నేను కావాలని చేశాను. అయితే ఇదంతా హాస్యాస్పదంగా జరిగింది. నేను చాలా సరదాగా ఉండే వ్యక్తిని’ అన్నాడు. అలాగే ఓ ఈవెంట్‌లో వరుణ్ అలియా నడుమును తాకడం గురించి కూడా అతను మాట్లాడాడు. ‘సరదా కోసం చేశాను. దీన్నే సరసాలు అనరు. మేం మంచి స్నేహితులం అని వరుణ్ చెప్పాడు.

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..