
టాలీవుడ్ హీరో అల్లు శిరీష్– నయనికల నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో కాబోయే దంపతులు ఉంగరాలు మార్చుకున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీలు, నయనిక కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరయ్యారు. కాబోయే దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం అల్లు శిరీష్– నయనికల ఎంగేజ్మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. కాగా ఈ ఎంగేజ్మెంట్ వేడుక తర్వాత సోషల్ మీడియాలో కొన్నిపోస్టులు పెట్టాడు శిరీష్. నిశ్చితార్థం ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఇదే సందర్భంగా నయనికతో తన ప్రేమ వ్యవహారం గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
“2023 అక్టోబర్‌లో వరుణ్, లావణ్యల పెళ్లి సందర్భంగా నితిన్, శాలిని కందుకూరి ఓ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి శాలిని తన స్నేహితురాలు నయనికను కూడా ఆహ్వానించింది. అప్పుడే నేను, నయనిక మొదటిసారి కలుసుకున్నాం. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఇప్పుడు మేమిద్దరం ప్రేమలో ఉండి, నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే.. ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతాను‘ అని శిరీష్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అల్లు శిరీష్– నయనిలకు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు. కాగా నయనిక శాలినితో పాటు రానా సతీమణి మిహికాకు కూడా మంచి స్నేహితురాలని తెలుస్తోంది. అల్లు శిరీష్– నయనికల వివాహం ఎప్పుడు జరుగుతుందన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. బహుశా వచ్చే ఏడాదిలో ఈ శుభకార్యం జరగవచ్చునని తెలుస్తోంది.
కాగా అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ వేడుకకు మెగా కుటుంబమంతా తరలివచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సురేఖ, ఉపాసన, వరుణ్ తేజ్, ఉపాసన, లావణ్య త్రిపాఠి, సాయి దుర్గ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరలంతా ఈ వేడుకలో సందడి చేశారు. కాబోయే దంపతులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు మెగాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.