BB3: నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. ‘బీబీ3’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య ఫ్రెష్ లుక్ అదుర్స్

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ వచ్ేసింది. అభిమానులకు బాలయ్య సండే‌ను మరింత ఆనందకరంగా మార్చారు. 

  • Ram Naramaneni
  • Publish Date - 3:52 pm, Sun, 31 January 21
BB3: నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్.. 'బీబీ3' రిలీజ్ డేట్ వచ్చేసింది.. బాలయ్య ఫ్రెష్ లుక్ అదుర్స్

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ వచ్ేసింది. అభిమానులకు బాలయ్య సండే‌ను మరింత ఆనందకరంగా మార్చారు. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్​ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది మే 28న విడుదల చేయనున్నట్లు తెలిపుతూ.. ఓ పోస్టర్​ను విడుదల చేసింది.

ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది. బాలకృష్ణ – బోయపాటి శ్రీను గతంలో ‘సింహా’, ‘లెజెండ్‌’ వంటి మాస్ బ్లాక్‌బాస్టర్ మూవీస్ వచ్చాయి. తాజాగా రూపొందుతున్న ‘బీబీ-3’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్​గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. తమన్ సంగీత అందిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

Also Read:

Director Shankar: దర్శకుడు శంకర్‌పై నాన్-బెయిలబుల్‌ వారెంట్.. ‘రోబో’ సినిమా కాపీ కేసులో కోర్టు సంచలన తీర్పు

Raviteja New Movie: చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ హిల్లేరియస్ కామెడీ మూవీ టైటిల్ పై కన్నేసిన మాస్ మహారాజా