Director Shankar: దర్శకుడు శంకర్‌పై నాన్-బెయిలబుల్‌ వారెంట్.. ‘రోబో’ సినిమా కాపీ కేసులో కోర్టు సంచలన తీర్పు

దర్శకుడు శంకర్‌కు ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ II కోర్టు షాకిచ్చింది. ఏకంగా పీటీ వారెంట్ జారీ చేసింది.  ఏంథిరన్ ( రోబో ) చిత్ర కథ తనదేనని ఆరూర్ తమిళ్‌నాథన్...

Director Shankar: దర్శకుడు శంకర్‌పై నాన్-బెయిలబుల్‌ వారెంట్.. 'రోబో' సినిమా కాపీ కేసులో కోర్టు సంచలన తీర్పు
Follow us

|

Updated on: Jan 31, 2021 | 2:56 PM

Director Shankar: దర్శకుడు శంకర్‌కు ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ II కోర్టు షాకిచ్చింది. ఏకంగా పీటీ వారెంట్ జారీ చేసింది.  ఏంథిరన్ ( రోబో ) చిత్ర కథ తనదేనని గతంలో ఆరూర్ తమిళ్‌నాథన్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. తన కథను ‘జిగుబా’ పేరుతో 1996 సంవత్సరంలో మొదటిసారి తమిళ పత్రికలో ప్రచురించానని, మరోసారి 2007 లో ‘ధిక్ ధీక్ దీపికా దీపికా’ అనే నవలగా తిరిగి ప్రచురించబడిందని చెప్పాడు. దాని ఆధారంగానే శంకర్ రోబో కథను తీసుకున్నారని కోర్టుకు విన్నవించాడు.

ఈ క్రమంలో 10 సంవత్సరాలుగా తమ ఆదేశాలు బేఖాతరు చేయడంపై న్యాయస్థానం దర్శకుడు శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే ఆదేశాలు ఇచ్చినప్పటికీ,  డైరెక్టర్ కోర్టుకు హాజరుకాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్ అయ్యారు.  పీటీ వారెంట్ జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది.

Also Read:

Ajinkya Rahane : సూర్య సినిమా పై ప్రశంసలు కురిపించిన టీమిండియా స్టార్ క్రికెటర్..

actress Hema : అలాంటి పాత్రలు దర్శకులు తనకు ఇవ్వడంలేదని కన్నీళ్లు పెట్టుకున్న నటి హేమ…