Nazriya Nazim : నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్‌గా వుండేది కాదు: నజ్రియా

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని.

Nazriya Nazim : నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్‌గా వుండేది కాదు: నజ్రియా
Nazriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2022 | 5:13 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి(Ante Sundaraniki ).. రీసెంట్ గా శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని. త్వరలో అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్  నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. ఈ సినిమాతో మలయాళీ బ్యూటీ నజ్రియా(Nazriya Nazim )తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. రీసెంట్ గా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని సందడి చేశారు. ఈ ఈవెంట్ లో నజ్రియా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నజ్రియా మాట్లాడుతూ.. వైజాగ్ గురించి చాల గొప్ప విన్నాను. ఇక్కడకి రావడం చాలా ఆనందంగా వుంది అన్నారు. గత ఏడాది నా సినీ ప్రయాణం గొప్ప అనిపించింది. ‘అంటే సుందరానికీ’తో మొదటి తెలుగు సినిమా చేయడం, తెలుగులో డబ్బింగ్ చెప్పడం, ఇప్పుడు వైజాగ్ రావడం ఈ మూడు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారు, రవి శంకర్ గారికి కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ లేకుంటే ఈ ప్రయాణం ఇంత గొప్పగా జరిగేది కాదు. దర్శకుడు వివేక్ ఆత్రేయ గారి తో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి. ప్రతి రోజు షూటింగ్ ని ఎంజాయ్ చేశాను. నన్ను , కథని ఎంతో అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మికి కృతజ్ఞతలు, అలాగే లతా, నాయుడు, పల్లవి.. అందరికీ థ్యాంక్స్.  నాని గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్ గా వుండేది కాదు. నాని గొప్ప కోస్టార్. ఇది నా మొదటి తెలుగు సినిమా. నాపై చాలా ప్రేమని చూపించారు. మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు. తప్పకుండా మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాను. జూన్ 10న అందరం థియేటర్ లో కలుద్దాం. ‘అంటే సుందరానికీ’ ఎంజాయ్ చేద్దాం” అన్నారు.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్