
బిగ్ బాస్ సీజన్ 7 అసలు సిసలు ట్విస్ట్ మొదలు కానుంది. ఇప్పటివరకు 14 మందిని హౌస్ లోకి పంపించి ఆతర్వాత నలుగురిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు ఈవారం ఊహించని ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది శుభ శ్రీ అని తెలుస్తోంది. అలాగే గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందని టాక్. ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ లోకి మరికొంతమందిని పంపించబోతున్నారు.
మరో ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అర్జున్ అంబటి, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, యూట్యూబర్ నయని పావని, హాట్ హీరోయిన్ అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గ్లామర్ డాల్ రతిక ఎలిమినేట్ అవ్వడంతో ఆమె స్థానంలో ఎవరు వస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు ఇద్దరు హాట్ బ్యూటీలు సందడి చేయనున్నారు.
హాట్ హీరోయిన్ అశ్విని బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ తో కట్టిపడేయడం పక్కాగా కనిపిస్తుంది. గేమ్ ఆడుతూనే తన అందంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటుందని అంటున్నారు. అలాగే యూట్యూబర్ నయని పావనికి కూడా బయట బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ హీరోయిన్ గా మారాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంది. ఇన్ స్టా రీల్స్ చేస్తూ తన టాలెంట్ ను చూపిస్తుంది ఈ చిన్నది. ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు బిగ్ బాస్ హౌస్ కు మరింత కలర్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నయని పావని, అశ్విని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.