AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు కోరికలు తీరాయి.. ఇక మిగిలింది ఆ ఒక్కటే. మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.

ఇక రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ చిత్రంలో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. అనంతరం అడివి శేష్‌ హీరోగా వచ్చిన హిట్‌2 చిత్రంతో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో మీనాక్షికి వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో వరుస సినిమాలతో ఫుల్‌ స్వింగ్‌ మీదుందీ చిన్నది. ఇక సినిమాలో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది...

రెండు కోరికలు తీరాయి.. ఇక మిగిలింది ఆ ఒక్కటే. మీనాక్షి చౌదరి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌.
Meenakshi Chaudhary
Narender Vaitla
|

Updated on: Oct 08, 2023 | 2:51 PM

Share

Meenakshi chaudhary: 2019లో బాలీవుడ్‌ చిత్రం అప్‌స్టార్ట్స్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది అందాల తార మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమాలో మీనాక్షి నటించింది చిన్న పాత్రే కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆ తర్వాత 2021లో తెలుగులో ‘ఇచట వాహనాలు నిలుపరాది’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిందీ చిన్నది. తొలి సినిమాలో తన నటన, అందంతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది.

ఇక రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ చిత్రంలో నటించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. అనంతరం అడివి శేష్‌ హీరోగా వచ్చిన హిట్‌2 చిత్రంతో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో మీనాక్షికి వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో వరుస సినిమాలతో ఫుల్‌ స్వింగ్‌ మీదుందీ చిన్నది. ఇక సినిమాలో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తన లేటెస్ట్‌ ఫొటోలతో ఫ్యాన్స్‌కు నిత్యం టచ్‌లో ఉంటుందీ చిన్నది.

ఈ క్రమంలోనే తాజాగా తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుందీ బ్యూటీ. మీనాక్షి బీడీఎస్‌ థర్డ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు తండ్రి బ్రెయిన్‌ ట్యూమర్‌తో చనిపోయినట్లు తెలిపింది. దీంతో చదువును పక్కన పెట్టేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి తల్లి.. మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనని అప్లై చేసిందని చెప్పుకొచ్చిన మీనాక్షి.. తండ్రి చనిపోయిన నెలకే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని, చాలా మంది నానా మాటాలన్నారని, ఆ మాటలు తనను ఎంతో బాధించాయని చెప్పుకొచ్చింది.

ఇక తన జీవితంలో మొత్తం మూడు కోరికలు ఉన్నాయన్న మీనాక్షి ఇప్పటికే రెండు కోరికలు తీరినట్లు చెప్పుకొచ్చింది. వీటిలో రెండు ఒకటి బీడీఎస్‌ పూర్తి చేయడం, రెండోది మిస్‌ ఇండియా పోటీలకు వెళ్లడం అని తెలిపింది. అయితే మీనాక్షి ఉన్న మూడో కోరిక ఐఏఎస్‌ కావడం. చివరికి ఏదో ఒక సినిమాలో కలెక్టర్‌ పాత్రలో నటించైనా ఐఏఎస్ అయ్యాయని సంతోషిస్తానని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

మీనాక్షి చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్..

తనకు స్పైసీ ఫుడ్‌ అంటే చాలా ఇష్టమని తెలిపిన మీనాక్షి.. తన అమ్మ వండిన మటన్ బిర్యానీ అంటే తెగ ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక హైదరాబాద్‌ బిర్యాటీ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఈ బ్యూటీ.. రంజాన్‌ సీజన్‌లో హైదరాబాద్‌ హలీమ్‌ను తెగ తినేస్తానని తెలిపింది. ఇక ఏమాత్రం తీరిక సయం దొరికినా.. అమ్మ దగ్గర ఉంటే వంట నేర్చుకుంటానని, లేదంటే ప్రయాణాలు చేస్తానని మీనాక్షి తెలిపింది. తనకు బ్యాడ్మింటన్ అంటే బాగా ఇష్టమని తెలిపిన మీనాక్షి.. తన ఫిట్‌నెస్ రహస్యం కూడా అదేనని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..