- Telugu News Photo Gallery Cinema photos Bhagavanth Kesari to Jawan Latest Movie Updates from industry
Movie Updates: సాయంత్రం భగవంత్ కేసరి ఈవెంట్.. షారుఖ్ ఖాన్ జవాన్ ఓటీటీ రిలీజ్..
సీనియర్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. వీనస్ మోటర్ సైకిల్ టూర్స్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో బైక్ రైడర్స్‌కు సర్వీసెస్ అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇవాళ వరంగల్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగబోతోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ విలన్‌గా కనిపించబోతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
Updated on: Oct 08, 2023 | 2:29 PM

సీనియర్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట తన పేరు మీద నడుస్తున్న ట్రస్ట్‌లు, అభిమాన సంఘాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. కొంతమంది అభిమానులు ప్రేమ చూపించటం కన్నా తన నుంచి ఏదో ఆశించటం ఎక్కువైపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారు.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు. వీనస్ మోటర్ సైకిల్ టూర్స్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో బైక్ రైడర్స్‌కు సర్వీసెస్ అందించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సంస్థ ద్వారా లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్లే బైకర్స్‌కు కావాల్సిన బైక్స్, ఇతర సామాన్లు సమకూర్చటంతో పాటు, అంతర్జాతీయ ట్రావెలర్స్‌కు లీగల్ హెల్ప్ కూడా చేయనున్నారు.

ఇవాళ వరంగల్‌లో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరగబోతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎక్స్ క్లూజివ్‌గా టీవీ9లో ఈ వేడుకలు ప్రసారం కానున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ విలన్‌గా కనిపించబోతున్నారు.

రీసెంట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాను నవంబర్ 2న ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్ వర్షన్‌లో లేని కొన్ని సీన్స్ ఓటీటీలో యాడ్ చేయబోతున్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ సినిమా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.




