- Telugu News Photo Gallery Cinema photos Those two heroines who thought their careers had come to a full stop, bounced back with announcement films
Movies News: ఆ ఇద్దరు హీరోయిన్స్ కెరీర్ ఇంకా ఫుల్ స్టాప్ అనుకున్నారంతా.. వరుస సినిమాలతో బౌన్స్ బ్యాక్..
ప్రజెంట్ హీరోయిన్లు కూడా ఫైటర్స్ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్ ఇక మిగిసినట్టే అని ఫిక్స్ అయిన ప్రతీసారి... ఇంట్రస్టింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి టఫ్ ఫేజ్‌లోనే ఉన్నారు ఇద్దరు అందాల భామలు. బ్యూటీ ప్లస్ టాలెంట్‌తో ఆకట్టుకున్న హీరోయిన్లు అప్ కమింగ్ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రానాకు జోడిగా నటించిన విరాటపర్వం సినిమా తరువాత మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి వెండితెర మీద కనిపించలేదు.
Updated on: Oct 08, 2023 | 1:54 PM

ప్రజెంట్ హీరోయిన్లు కూడా ఫైటర్స్ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్ ఇక మిగిసినట్టే అని ఫిక్స్ అయిన ప్రతీసారి... ఇంట్రస్టింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతున్నారు. ఇప్పుడు అలాంటి టఫ్ ఫేజ్‌లోనే ఉన్నారు ఇద్దరు అందాల భామలు. బ్యూటీ ప్లస్ టాలెంట్‌తో ఆకట్టుకున్న హీరోయిన్లు అప్ కమింగ్ సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

రానాకు జోడిగా నటించిన విరాటపర్వం సినిమా తరువాత మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి వెండితెర మీద కనిపించలేదు. గార్గి సినిమాతో డిజిటల్ ఆడియన్స్‌ను పలకరించినా అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. ఆ తరువాత మరే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఫ్యాన్స్ ఈ నేచురల్ బ్యూటీని మిస్ అవుతున్నారు.

ఫైనల్‌గా ఈ వెయిటింగ్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారు సాయి పల్లవి. వరుస సినిమాలు కమిట్ అవుతూ న్యూస్ హెడ్ లైన్స్‌లో హల్‌చల్ చేస్తున్నారు. తమిళ్‌లో శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్నారు.

తెలుగులో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు బాలీవుడ్ మేకర్స్ ప్రస్టీజియస్‌గా రూపొందిస్తున్న రామాయణంలోనూ సీత పాత్రకు సాయి పల్లవి పేరునే పరిశీలిస్తున్నారట.

సాయి పల్లవి మాత్రమే కాదు మరో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కూడా షార్ట్ గ్యాప్ తరువాత బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో అవకాశాలు చేజారటంతో నార్త్ మీద ఫోకస్ పెంచిన బుట్టబొమ్మ, అక్కడ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్‌కు జంటగా తెరకెక్కుతున్న కోయి షక్‌తో పాటు మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం యాక్షన్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు అరవింద.




