Natural star Nani: ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయనున్న నేచురల్ స్టార్ నాని..

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న నాని త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు

Natural star Nani: ఒకేసారి రెండు సినిమాలను పూర్తి చేయనున్న నేచురల్ స్టార్ నాని..

Edited By:

Updated on: Apr 26, 2021 | 9:32 AM

Natural star Nani:

నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్న నాని త్వరలో మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వములో ఇప్పటికే టక్ జగదీష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు నాని. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫెమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘అంటే .. సుందరానికీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని.

కరోనా కారణంగా చాలా సినిమాలు పేకప్ చెప్పేసుకుని లొకేషన్లు వదిలేసి వెళ్లిపోయాయి. కానీ నాని మాత్రం తన  సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ ఉండటం విశేషం. అటు కొన్ని రోజులు .. ఇటు కొన్ని రోజులు కేటాయిస్తూ సినిమా  షూటింగులు కానిచ్చేస్తున్నాడట. అయితే తాను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ .. టీమ్ ను అప్రమత్తం చేస్తున్నాడని అంటున్నారు. నాని ఒప్పుకున్న ‘శ్యామ్ సింగ రాయ్’ .. ‘ అంటే .. సుందరానికీ!’ రెండు ప్రాజెక్టులు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలను ఎట్ ఏ టైం లో పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట నాని.

మరిన్ని ఇక్కడ చదవండి : 

pawan kalyan: అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లోమార్పులు.. పవన్ కోసం ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారట..

రికార్డ్ క్రియేట్ చేసిన సిద్ శ్రీరామ్ పాట.. భారీ వ్యూస్ దక్కించుకున్న ‘ఒకేఒక లోకం నువ్వే’ పాట..

RRR: ఆర్ఆర్ఆర్ లో అందమైన ప్రేమకావ్యం.. ఇద్దరు భామలతో ఎన్టీఆర్ ప్రేమాయణం