AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న అల్లు అయాన్.. వీడియోస్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..

నెట్టింట ఇప్పుడు అల్లు వారబ్బాయి తెగ ట్రెండ్ అవుతున్నాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఇంట్లో తన తండ్రితో కలిసి అర్హ, అయాన్ చేసే అల్లరికి అందరూ ఫిదా కావాల్సిందే. ఇక షూటింగ్ నుంచి కాస్త్ బ్రేక్ దొరికితే తన పిల్లలతో కలిసి బన్నీ చేసే అల్లరి, ఫన్నీ గేమ్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

Allu Arjun: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న అల్లు అయాన్.. వీడియోస్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Allu Arjun, Allu Ayaan
Rajitha Chanti
|

Updated on: Aug 30, 2023 | 6:56 AM

Share

అల్లు అర్జున్..ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు. పుష్ప సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చేసిన ఈహీరో.. ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకుని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటివరకు తెలుగులో ఏ నటుడు అందుకుని నేషనల్ అవార్డ్ అందుకొని తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో నెట్టింట ఇప్పుడు అల్లు వారబ్బాయి తెగ ట్రెండ్ అవుతున్నాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఇంట్లో తన తండ్రితో కలిసి అర్హ, అయాన్ చేసే అల్లరికి అందరూ ఫిదా కావాల్సిందే. ఇక షూటింగ్ నుంచి కాస్త్ బ్రేక్ దొరికితే తన పిల్లలతో కలిసి బన్నీ చేసే అల్లరి, ఫన్నీ గేమ్స్ వీడియోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

అయితే బన్నీ ఎక్కువగా తన కూతురుతో అల్లరి చేస్తున్న వీడియోస్ నెట్టింట ట్రెండ్ అవుతుంటాయి. అయాన్ ఫోటోస్, వీడియోస్ అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అయాన్ ట్రెండ్ అవుతున్నాడు. ముఖ్యంగా అందులో అయాన్ చేసే పనులు తెగ నవ్విస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇటీవల బన్నీ మామ కట్టించిన కన్వెన్షన్ హాల్ ఓపెనింగ్ కోసం అల్లు అర్జున్ తన కుమారుడితోపాటు నల్గొండకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పూజా కార్యక్రమంలో అందరూ బిజీగా ఉండగా.. రెండు చేతులను కళ్లకు అడ్డుపెట్టి.. అందులోంచి చూస్తూ అందరినీ నవ్వించేశాడు. ఇక అప్పుడే బన్నీ చేతులను అడ్డు తీసేయగా.. మరోసారి వన్ అని చూపిస్తూ నవ్వించాడు.

ఇక మొన్న జాతీయ అవార్డ్ రావడం గురించి ఇంటి ముందు మీడియాతో బన్నీ మాట్లాడుతుండగా.. ఇంట్లో పై నుంచి అద్దాలకు అతుక్కుని కనిపించాడు. అంతేకాదు.. అక్కడ వింతగా ఫోజు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయాన్ అలా కనిపించడంతో నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. బన్నీకి నేషనల్ అవార్డ్ వచ్చినప్పటి నుంచి ఆయన కంటే అయాన్ ఫన్నీ వీడియోస్ మాత్రమే ఎక్కువగా వైరలవుతున్నాయి. అయాన్ ఫన్నీ వీడియోస్ పై మీరు ఓ లుక్కేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్