Naresh- Pavitra Lokesh: మళ్ళీ పెళ్లి అంటున్న నరేష్, పవిత్ర లోకేష్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

|

Mar 24, 2023 | 3:38 PM

త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నరేష్ కు ఇది నాలుగో పెళ్లి, పవిత్రకు రెండో పెళ్లి.

Naresh- Pavitra Lokesh: మళ్ళీ పెళ్లి అంటున్న నరేష్, పవిత్ర లోకేష్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
Naresh Pavitra Lokesh
Follow us on

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన నరేష్ , పవిత్ర పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతకొంతకాలంగా నరేష్, పవిత్ర రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. త్వరలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటి కాబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే నరేష్ కు ఇది నాలుగో పెళ్లి, పవిత్రకు రెండో పెళ్లి. ఈ ఇద్దరు కొంతకాలంగా చట్టపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలా సార్లు ఈ జంట మీడియా కంట పడ్డారు. ఇదిలా ఉంటే న్యూ ఇయర్ రోజు పెళ్లి చేసుకోబోతున్నాం అని ఒక అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. అలాగే లిప్ లాక్ పెట్టుకొని షాక్ ఇచ్చారు. ఆ వెంటనే కొద్ది రోజుల తరవాత ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటూ ఓ వీడియోను షేర్ చేశారు.

ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఈ ఇద్దరు చెప్పాపెట్టకుండా పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. అలాగే పెళ్లి అయిన వెంటనే దుబాయ్ కూడా వెళ్లారని.. అక్కడ చట్టపట్టాలేసుకు తిరిగారు కూడా. అయితే ఇదంతా నిజం కాదని.. ఓ సినిమా కోసం అని అన్నారు

తాజాగా అదే నిజం చేస్తూ.. మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మళ్లీ పెళ్లి అనే టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నరేష్, పవిత్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పవిత్ర ముగ్గువేస్తుండగా.. నరేష్ పక్కన చూస్తూ ఉన్న పోస్టర్ ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..