Arunachalam: అరుణాచలం సినిమాలో నటించిన ఈ బామ్మా గుర్తుందా..? ఆమె ఎవరో తెలుసా..?

1997లో వచ్చిన ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన సౌందర్య, రంభ హీరోయిన్స్ గా నటించారు.

Arunachalam: అరుణాచలం సినిమాలో నటించిన ఈ బామ్మా గుర్తుందా..? ఆమె ఎవరో తెలుసా..?
Arunachalam
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 23, 2023 | 8:53 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ లిస్ట్ లో అరుణాచలం సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1997లో వచ్చిన ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన సౌందర్య, రంభ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా హీరో రజినీకాంత్ కు బామ్మ పాత్రలో చేసిన నటి చాలా ఫేమస్ అయింది. నెగిటివ్ రోల్ లో ఆకట్టుకుంది. ఆమె పేరు వడివుక్కరసి. ఈమె తమిళ్ లో చాలా ఫెమస్ యాక్టర్. చాలా సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించింది.

అలాగే తెలుగులోనూ డబ్బింగ్ మూవీస్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆమె తనకన్నా ఎక్కువ వయసున్న పాత్రల్లో నటించి మెప్పించింది. దాదాపు 350 పైగా చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. సినిమాలో ఆమె చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. అలాగే ముసలావిడగా.. వంగిన నడుముతో ఇలా కష్టపడుతూ సింగిల్ షాట్ లోనే షూటింగ్ అంతా పూర్తి చేసిందట ఆమె.Vadivukkarasi

Vadivukkarasi