రోహిత్..నీవెక్కడ !

నారా రోహిత్..టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్. బాణం, సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు రోహిత్.

రోహిత్..నీవెక్కడ !
Follow us

|

Updated on: Nov 03, 2020 | 9:16 PM

నారా రోహిత్..టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్. బాణం, సోలో, రౌడీ ఫెల్లో, అసుర లాంటి విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్నాడు రోహిత్. చాలా పరిణితి చెందిన నటనను ప్రదర్శిస్తూ..తనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ఈ హీరో తెరపై కనిపించి చాలా కాలమైంది. ‌ఒకానొక సమయంలో క్షణం తీరిక లేకుండా షూటింగుల్లో చేశాడు రోహిత్. ఆ సినిమాలను వెంటవెంటనే రిలీజ్ చేశాడు. అప్పట్లో ఒకడుండేవాడు తర్వాత హీరోగా ఐదు సినిమాలు చేశాడు. అవన్నీ నిరాశపరిచాయి. దీంతో అతడు ఆలోచనలో పడ్డాడు. అలా చూస్తుండగానే 3 సంవత్సరాలు గడిచిపోయాయి. వెయిట్ కూడా పెరగడంతో కాస్త గ్యాప్ తీసుకుని…  ఈ మ‌ధ్య బ‌రువు త‌గ్గి, లుక్ మార్చేశాడు రోహిత్. అతడు పుష్ప సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అది నిజం కాదని తెెలిసింది. తాజాగా నాని చేయ‌బోతున్న  మూవీ శ్యామ్ సింగ‌రాయ్‌లో నారా రోహిత్ ఓ కీల‌క పాత్ర చేయ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ట్యాక్సీవాలా ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్య‌న్ తెర‌కెక్కించిన ఈ సినిమా నాని కెరీర్లోనే అత్యధిక బ‌డ్జెట్లో తెర‌కెక్క‌నుంది.  రోహిత్ ఓకే చెప్పాడంటే అది  మంచి  పాత్రే అయి ఉంటుంది. మరి రోహిత్ మళ్లీ జోరు పెంచుతాడేమో చూడాలి.

Also Read :

ఆర్‌ఆర్‌ఆర్‌లో జలియన్ వాలా బాగ్ ఎపిసోడ్ !

యువతి ప్రాణం తీసిన మొబైల్ లోన్ యాప్‌లు !