Bigg Boss 4: కొనసాగిన నామినేషన్ల పర్వం.. ఆ ఐదుగురు నామినేట్‌

మంగళవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్‌ పర్వం కొనసాగింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో అవినాష్‌ని నామినేట్ చేసిన అభి, రెండో గుడ్డును మాస్టర్‌ తలపై కొట్టాడు

Bigg Boss 4: కొనసాగిన నామినేషన్ల పర్వం.. ఆ ఐదుగురు నామినేట్‌
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 7:28 AM

Elimination Nomination Bigg Boss 4: మంగళవారం నాటి ఎపిసోడ్‌లో నామినేషన్‌ పర్వం కొనసాగింది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో అవినాష్‌ని నామినేట్ చేసిన అభి, రెండో గుడ్డును మాస్టర్‌ తలపై కొట్టాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఓ రేంజ్‌లో వార్ జరిగింది. ఆ తరువాత హారిక వంతు రాగా.. ఆమె అభిజిత్‌ని ఫాలో అయ్యింది. మొదటి గుడ్డు అవినాష్‌పై, రెండో గుడ్డును అమ్మ రాజశేఖర్‌పై కొట్టింది.

ఆ తరువాత లాస్య ఒక గుడ్డును అవినాష్‌పై, మరో గుడ్డును లాస్యపై కొట్టింది. ఇక మోనాల్ వంతు రాగా.. గుడ్డు కొట్టడం ఇష్టం లేని మోనాల్, అవినాష్ హెల్ప్ తీసుకుంది. మొదటి గుడ్డును సొహైల్‌పై, రెండో గుడ్డును లాస్యపై కొట్టించింది. ఆ తరువాత వచ్చిన రాజశేఖర్ మాస్టర్‌.. ఎలాంటి ఆలోచన లేకుండా మొదటి గుడ్డు అభిజిత్‌పై తలపై కొట్టాడు. రెండో గుడ్డును అఖిల్‌ తలపై కొట్టాడు. ( రాజన్న హుండీ ఆదాయం 78.85లక్షలు)

ఆ తరువాత మెహబూబ్ ప్రతివారంలాగే మొదటి గుడ్డు హారిక తలపై పగలగొట్టాడు. రెండో గుడ్డును అవినాష్‌ తలపై పగలగొట్టాడు. ఇక అఖిల్‌.. మొదటి గుడ్డును మాస్టర్‌ తలపై కొట్టి, రెండో గుడ్డును మోనాల్‌ తలపై కొట్టాడు. దీంతో మోనాల్ సహా అందరూ షాక్‌కి గురయ్యారు. మాస్టర్ అయితే.. వాడేంట్రా మోనాల్‌ని నామినేట్ చేస్తున్నాడు. తప్పురా అంటూ ఆశ్చర్యపోయాడు. ఇలా హాట్ హాట్‌గా సాగిన 9వవారం నామినేషన్‌లో చివరగా అవినాష్, రాజశేఖర్, అభిజిత్, హారిక, మోనాల్‌‌లు ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. (పీఎస్‌ఎల్‌వీ–సీ49 ప్రయోగానికి రంగం సిద్ధం)