Bigg Boss 4: నువ్వు నోర్మూయ్‌.. హారికపై మాస్టర్ ఫైర్‌

ఎలిమినేషన్‌లో భాగంగా అభిజిత్‌, అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని ఎలిమినేట్ చేసినప్పుడు మాటల యుద్ధం జరిగింది. మాస్టర్ మీరు ఎదుటి వాళ్లను అంటారు.

Bigg Boss 4: నువ్వు నోర్మూయ్‌.. హారికపై మాస్టర్ ఫైర్‌
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 8:00 AM

Bigg Boss 4 Telugu: ఎలిమినేషన్‌లో భాగంగా అభిజిత్‌, అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని ఎలిమినేట్ చేసినప్పుడు మాటల యుద్ధం జరిగింది. మాస్టర్ మీరు ఎదుటి వాళ్లను అంటారు. కానీ తిరిగి అంటే రిసీవ్ చేసుకోలేరు. నోయల్‌ ఎవర్నో నామినేట్ చేస్తే మీరు అరగంట క్లాస్ పీకారు. కాలు నొప్పి ఉన్నా అలాగే విన్నాడు అని అభిజిత్‌ చెప్పబోతుండగా.. మాస్టర్ అడ్డు తగిలాడు. గతవారం తనని ఒంటికాలిపై నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని అసలు వాడెవడు నాకు పన్మిష్మెంట్ ఇవ్వడానికి, నేను ఆ విషయాన్ని వదిలేద్దాం అనుకున్నా. కానీ నువ్వు మళ్లీ కెలికావు అంటూ మండిపడ్డాడు. ( Breaking: కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానంద రెడ్డి కన్నుమూత)

దీంతో నన్ను మాట్లాడనివ్వండి మాస్టర్ అన్న అభిజిత్‌.. మీరు చెప్పిందే తప్ప ఎదుటివారిని చెప్పనివ్వరు. ఈ కారణంతోనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని వివరణ ఇచ్చాడు. అయినా మాస్టర్ ఆవేశం తగ్గలేదు. అందరూ నా జీవితాన్ని అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ంటూ మండిపడ్డాడు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌లో దూరేందుకు అవినాష్ ప్ర‌య‌త్నించ‌గా.. హారిక మ‌ధ్య‌లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ంటూ హితవు పలికింది. అయితే అప్ప‌టికే ఫుల్‌ ఫైర్‌లో ఉన్న మాస్ట‌ర్ ఆవేశంలో.. హారిక‌ను నోరు మూర్మోయ్ అంటూ నోరు జారాడు. ఆ తరువాత కూడా అభి, మాస్టర్ మధ్య చాలా సేపు మాటల యుద్ధం జరిగింది. (Bigg Boss 4: కొనసాగిన నామినేషన్ల పర్వం.. ఆ ఐదుగురు నామినేట్‌)