ఆర్‌ఆర్‌ఆర్‌లో జలియన్ వాలా బాగ్ ఎపిసోడ్ !

టాలీవుడ్ దర్శక ధీరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా  ‘ఆర్ఆర్ఆర్’  సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై సినీ ప్రేమికులకు భారీ అంచనాలున్నాయి.

ఆర్‌ఆర్‌ఆర్‌లో జలియన్ వాలా బాగ్ ఎపిసోడ్ !
Follow us

|

Updated on: Nov 03, 2020 | 8:41 PM

టాలీవుడ్ దర్శక ధీరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా  ‘ఆర్ఆర్ఆర్’  సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై సినీ ప్రేమికులకు భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగానే మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్‌తో పాటు పలువురు బాలీవుడ్, హాలివుడ్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.  అలనాటి చరిత్ర వీరుల కథలను ప్రామాణికంగా తీసుకుని..కాస్త కల్పిత కథను కూడా జోడిచ్చి జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో కీల‌క ఘట్టమైన ‘జ‌లియ‌న్ వాలాబాగ్’ ఎపిసోడ్ ను ఈ సినిమాలో జక్కన్న చూపించబోతున్నారని టాక్ వస్తోంది.

భారత స్వాతంత్ర్య పోరాటంలో జలియన్ వాలా బాగ్ ఉదంతం సంచలనం రేపింది. భారతీయులపై జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ అమానుషానికి ఆ దుర్ఘటనను నిదర్శనం చెబుతారు. డయ్యర్ ఆదేశాలతో బ్రిటీష్ సైన్యం జరిపిన కాల్పుల్లో 1000 మంది భార‌తీయులు చనిపోయారరు. ఈ ఘటనతోనే బ్రిటిషువారిపై భారతీయుల ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఈ రకంగా స్వాతంత్ర్య సంగ్రామాన్ని మలుపు తిప్పిన ఈ ఘటనను ‘ఆర్ఆర్ఆర్’లో కళ్లకు కట్టినట్టు జక్కన్న చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే,  అల్లూరి, కొమ‌రం భీమ్‌ల క‌థ‌ల‌కూ, జలియన్ వాలాబాగ్ ఘటనకు ఎటువంటి సంబంధం లేదు. అయితే, కల్పిత కథ కాబట్టి పిరియాడికల్ ఎపిసోడ్ కోసం జ‌లియ‌న్ వాలా బాగ్ ఉదంతాన్ని సినిమాలో చూపించబోతున్నారని చెబతున్నారు. దీనిపై ఆర్.ఆర్.ఆర్ చిత్ర వర్గాలను ఆరా తీయగా అదేం లేదంటూ కొట్టిపారేస్తున్నారు. అయితే సినిమా గురించి ఏమైనా లీకులు బయటకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజమౌళి యూనిట్‌ను హెచ్చరించారట. దీంతో వారు కూడా సమాచారం ఇచ్చేందుకు జంకుతున్నారు. ఈ సస్పెన్స్ వీడాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Also Read :

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..