Nara Lokesh: నేను చిరంజీవి అభిమానిని.. పవన్‌ది మంచి మనసు.. మెగా బ్రదర్స్‌ గురించి నారా లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే?

'నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య' సినిమా చూశాను. ఇక బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా మ‌ద్దుల మామ‌య్య‌. విడుద‌లైన మొద‌టి రోజు, మొద‌టి షోనే బాలయ్య సినిమాలు చూస్తాను’ అని లోకేశ్‌ అన్నారు

Nara Lokesh: నేను చిరంజీవి అభిమానిని.. పవన్‌ది మంచి మనసు.. మెగా బ్రదర్స్‌ గురించి నారా లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే?
Chiranjeevi, Pawan Kalyan,Nara Lokesh

Updated on: Feb 25, 2023 | 6:10 AM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కుప్పంలో మొదలైన ఈ యాత్ర ఇప్పుడు తిరుపతి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతిలోని యువతతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేశ్‌ ఆసక్తికర సమాధానాలిచ్చారు. అదే సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేశారు. ‘నేను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని. ఆయ‌న హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూశాను. ఇక బాల మామ గురించి చెప్పాలంటే ఎంతైనా నా మ‌ద్దుల మామ‌య్య‌. ఆయన అన్ స్టాపబుల్. బాలయ్య  కొత్త సినిమా రిలీజ్ అయితే మొదటి షోకు మొదట ఉండేది నేనే’ అని లోకేశ్‌ అన్నారు. అదే సందర్భంలో  జనసేనాని పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావాలంటే ముందు మంచి మనసు ఉండాలని.. 2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌లో ఆ మంచి మనసును చూశానన్నారు. ఇలాంటివారు రాజకీయాల్లో తప్పకుండా ఉండాలన్నారు

కాగా 20024 ఎన్నికల్లో జనసేనతో కలిసి బరిలోకి దిగే యోచనలో ఉంది టీడీపీ. ఈనేపథ్యంలో ఏపీని అభివృద్దిలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలని నారా లోకేశ్‌ పిలుపునివ్వడం, అందులోనూ ప్రత్యేకంగా మెగా బ్రదర్స్‌ గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లోకేశ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..