Tuck Jagadish: నాని ఖాతాలో సరికొత్త రికార్డ్.. ఇప్పటివరకూ ఏ సినిమా వల్ల కానిది టక్ జగదీష్ సాధించింది..
నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది.
Tuck Jagadish: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్‌గా నటించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూవర్ షిప్ తెచ్చుకుంటుంది. కుటుంబంలో వచ్చిన సమస్యను చక్కదిదే యువకుడిగా ఈ సినిమాలో కనిపించాడు నాని. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో కాస్త హడావిడి జరిగిన విషయం తెలిసిందే. సినిమాలు థియేటర్స్‌లో విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మాత్రం ఓటీటీ బాట పట్టడం పై థియేటర్స్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సినిమాలు కూడా దైర్యం చేసి థియేటర్స్‌లో విడుదల అవుతుంటే.. నానిలాంటి హీరో నటించిన సినిమా ఓటీటీ లో విడుదల చేయడం పై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో నాని ఈ విషయం పై స్పందిస్తూ.. నన్ను బయటవాడిగా చూడడం భాదగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తనికి ఈ గందరగోళం నుంచి బయటకు వచ్చి టక్ జగదీష్ సినిమా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
34కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు 17 కోట్ల మేర లాభాలు వచినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు కూడా వచ్చి చేరింది. ఇంతవరకూ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన అన్ని తెలుగు సినిమాలలో.. మొదటి రోజే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది టక్ జగదీష్. ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :