గ్యాంగ్ లీడర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ ..!

నేచురల్ స్టార్ నానికి సెప్టెంబర్ సెంటిమెంట్ ఆట..! సెప్టెంబర్ లో వచ్చిన అష్టా చెమ్మా, భలేభలే మగాడివోయ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో నానికి సెప్టెంబర్ నెల అచ్చొంచింది అనుకుంటున్నాడట..! అందుకే తన  కొత్త సినిమా గ్యాంగ్ లీడర్ కూడా వచ్చే నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తరకెక్కిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్..ఇందులో నాని హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా, ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ […]

గ్యాంగ్ లీడర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ ..!
Follow us
Anil kumar poka

|

Updated on: Aug 09, 2019 | 1:07 PM

నేచురల్ స్టార్ నానికి సెప్టెంబర్ సెంటిమెంట్ ఆట..! సెప్టెంబర్ లో వచ్చిన అష్టా చెమ్మా, భలేభలే మగాడివోయ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో నానికి సెప్టెంబర్ నెల అచ్చొంచింది అనుకుంటున్నాడట..! అందుకే తన  కొత్త సినిమా గ్యాంగ్ లీడర్ కూడా వచ్చే నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తరకెక్కిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్..ఇందులో నాని హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా, ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ చేస్తున్నాడు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే, మొదట్లో  ఆగస్ట్ 30న గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ , అదే రోజు ప్రభాస్ నటిస్తున్న సాహూ సినిమా విడుదల కానుండడంతో తమ చిత్రాన్ని వాయిదా వేసుున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. సాహూ సినిమా తప్పక బ్లాక్ బస్టర్ అవుతుందని, ఆ సినిమా సక్సెస్ తో మనం సంబరాలు చేసుకుంటామని తాజాగా నాని ట్వీట్ చేశారు.  దీన్ని బట్టి ప్రభాస్ సినిమా కోసం నాని కాంప్రమైజ్ అయ్యాడనిపిస్తోంది.  అందుకే సెప్టెంబర్ 13వ తేదీన గ్యాంగ్ లీడర్ విడుదలకు మూహూర్తం ఖరారు చేశారట. త్వరలోనే కొత్త డేట్ ను ఎనౌన్స్ చేస్తారట.