మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్.. కేక పుట్టిస్తోన్న మహేష్ లుక్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ 26వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మహేష్ ఇంట్రోకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో ఆర్మీ ఆఫీసర్ మేజర్ అజయ్ కృష్ణ కారెక్టర్‌లో క్లాస్ లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు సూపర్‌స్టార్. ఆర్మీ డ్రెస్‌లో అతడు నడుచుకుంటూ వస్తున్న […]

మేజర్ అజయ్ కృష్ణ రిపోర్టింగ్.. కేక పుట్టిస్తోన్న మహేష్ లుక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Aug 09, 2019 | 9:36 AM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్ 26వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇవాళ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మహేష్ ఇంట్రోకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో ఆర్మీ ఆఫీసర్ మేజర్ అజయ్ కృష్ణ కారెక్టర్‌లో క్లాస్ లుక్‌లో కేక పుట్టిస్తున్నాడు సూపర్‌స్టార్. ఆర్మీ డ్రెస్‌లో అతడు నడుచుకుంటూ వస్తున్న తీరు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తుంది. విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్-అనిల్‌ల క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.