AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్, క్లాస్.. నీ ‘దూకుడు’కు ‘సరిలేరు’ ఎవరు

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘దూకుడు’కు మరో పేరు. ఈ పేరు వినగానే ఎన్నో రికార్డులు, మరెన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ఇటు క్లాస్, అటు మాస్.. మరోవైపు ప్రయోగాలతో వయసు బేధం లేకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఘనత మహేష్ బాబుది. కృష్ణ వారసుడిగా చిన్నవయసులోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని మించిన తనయుడిగా.. ‘రాజకుమారుడు’గా అభిమానులు గర్వపడేలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు ఈ ‘మహర్షి’. అంతేకాదు మరోవైపు నిర్మాణరంగంలోనూ రాణిస్తున్న ఆయన.. […]

మాస్, క్లాస్.. నీ ‘దూకుడు’కు ‘సరిలేరు’ ఎవరు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2019 | 12:28 PM

Share

సూపర్‌స్టార్ మహేష్ బాబు.. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘దూకుడు’కు మరో పేరు. ఈ పేరు వినగానే ఎన్నో రికార్డులు, మరెన్నో విజయవంతమైన సినిమాలు గుర్తొస్తాయి. ఇటు క్లాస్, అటు మాస్.. మరోవైపు ప్రయోగాలతో వయసు బేధం లేకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఘనత మహేష్ బాబుది. కృష్ణ వారసుడిగా చిన్నవయసులోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తండ్రిని మించిన తనయుడిగా.. ‘రాజకుమారుడు’గా అభిమానులు గర్వపడేలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు ఈ ‘మహర్షి’.

అంతేకాదు మరోవైపు నిర్మాణరంగంలోనూ రాణిస్తున్న ఆయన.. ఆ మధ్య ఏఎమ్‌బీ సినిమాస్‌ను నిర్మించి మల్టీఫెక్స్ రంగంలోకి, తాజాగా హంబుల్ అనే బ్రాండ్‌తో ఆన్‌లైన్ దుస్తుల రంగంలోకి వచ్చి.. పక్కా ‘బిజినెస్‌మాన్‌’గానూ తనదైన ముద్రను వేస్తున్నాడు ఈ ‘యువరాజు’. అంతేనా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని ‘శ్రీమంతుడు’గా మారి.. ఆ గ్రామ అభివృద్ధికి తనదైన సామాజిక బాధ్యతను నెరవేస్తున్నాడు. ఇక వీటితో పాటు మరోవైపు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ పలువురి ప్రాణాలు కాపాడి వారి కుటుంబాల్లో ‘ఒక్కడు’గా పేరు సంపాదించుకున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తన కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తూ.. ముఖ్యంగా పిల్లలను క్రమశిక్షణతో పెంచుతూ ‘సరిలేరు నీకెవ్వరు’గా వెలుగొందుతున్నాడు ఈ ‘పోకిరి’.

కాగా ఇవాళ మహేష్ 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఏదేమైనా మహేష్ ‘ఖలేజా’ ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్ మహేష్‌బాబు.

Follow Us
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
శ్రీలంక బౌలర్లపై వైభవ్ సూర్యవంశీ విరుచుకుపడతాడా?
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఏటీఎంకు వెళ్లేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే డబ్బులు హాంఫట్
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంలోని 10 కీలక అంశాలు ఇవే!
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
నన్ను హీరో అని చెప్పి.. తర్వాత కథ మార్చేశారు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
షాపుకొచ్చిన అమ్మాయికి కూల్ డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లాడు..
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
అమెరికాలో ‘దెయ్యాల ఊరు’.. అక్కడ ఎవరూ ఉండరు.. అయినా కోట్లలో ఖర్చు!
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
మెన్స్ or ఉమెన్స్.. నెం.18తో పాకిస్థాన్‌కు దబిడి దిబిడే
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
బడికి వెళ్లే పిల్లలకు అమృతం.. ఒక్కటి తింటే చాలు వెయ్యేనుగుల బలం
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
మ్యాచ్‌ను తిప్పేసిన దీప్తి శర్మ డైరెక్ట్ హిట్
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ
ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ.. స్విమ్మింగ్ పూల్‌లో తేలిన డెడ్ బాడీ