‘మన్మధుడు 2’ రివ్యూ

టైటిల్ : ‘మన్మధుడు 2’ తారాగణం : కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు సంగీతం : చైత‌న్య భ‌రద్వాజ్‌ నిర్మాతలు : నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రాహుల్ ర‌వీంద్ర‌న్‌ విడుదల తేదీ: 09-08-2019 అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో రకుల్ […]

'మన్మధుడు 2' రివ్యూ
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 09, 2019 | 5:49 PM

టైటిల్ : ‘మన్మధుడు 2’

తారాగణం : కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు

సంగీతం : చైత‌న్య భ‌రద్వాజ్‌

నిర్మాతలు : నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రాహుల్ ర‌వీంద్ర‌న్‌

విడుదల తేదీ: 09-08-2019

అక్కినేని నాగార్జున హీరోగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘మన్మధుడు 2’. లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

సామ్ అలియాస్ సాంబశివరావు (అక్కినేని నాగార్జున) పోర్చుగల్‌‌లో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి. పెళ్లిపై పట్టింపు లేకుండా తల్లి(లక్ష్మీ), అక్క(ఝాన్సీ)తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ ఒకానొక సందర్భంలో పెళ్లి చేసుకోవాలని సామ్‌ను ఒత్తిడి చేస్తుంది తల్లి. అలాంటి బంధాలకు ఇష్టపడని సామ్.. తనను మోసగించి వెళ్ళిపోయిన ప్రియురాలిగా అవంతిక(రకుల్ ప్రీత్ సింగ్)ను కుటుంబానికి పరిచయం చేస్తాడు. అవంతిక సామ్ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత వచ్చిన ఇబ్బందులు ఏంటి.? సామ్ ఎందుకు పెళ్లి, పిల్లలు వంటి సుదీర్ఘమైన బంధాలకు దూరంగా ఉన్నాడు.? చివరికి సామ్ పెళ్లి జరిగిందా లేదా.? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

వయసు మీద పడుతున్నా.. నాగార్జున మన్మధుడిగా మరోసారి తన ఛార్మింగ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌లో తనదైన శైలి మార్క్‌ నటనతో అలరించాడు. ఇక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విషయానికి వస్తే.. మోడరన్ గర్ల్ అవంతిక పాత్రలో చక్కగా నటించింది. అటు గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. కమెడియన్ వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది. ఇక నటుడు రావు రమేష్ ఎప్పటిలానే తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

విశ్లేష‌ణ‌ :

‘మన్మధుడు 2’ ఫ్రెంచ్ సినిమాకు రీమేక్ అయినా.. దర్శకుడు ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కథలో కొత్తదనం లేకపోవడంతో.. పలు హిందీ, తెలుగు చిత్రాలను కలిపి మిక్స్ చేసిన భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. ఇకపోతే ఈ సినిమకు ప్రధాన మైనస్ పాయింట్ మాటలు. అలాగే మూవీలో ఝాన్సీ కిస్సింగ్ సన్నివేశం లాంటి కొన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బందిగా ఫీలయ్యే సన్నివేశాలు ఉన్నాయి. ఇక నాగార్జున, రకుల్ దూరమైన తర్వాత కథ అంతగా ఆసక్తిగా సాగలేదు. రెండో భాగం పూర్తిగా తేలిపోయింది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఈ సినిమాను దాదాపు విదేశీ లొకేషన్స్‌లో చిత్రీకరించడం వల్ల కెమెరా వర్క్‌తో పాటు నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఓకే.. కానీ ఇంకా చాలా సీన్స్ మాత్రం ట్రిమ్ చేయాల్సిన అవసరం ఉంది.

చిలసౌ లాంటి చిత్రం తరువాత దర్శకుడు రాహుల్ తీస్తున్న మన్మధుడు 2 చిత్రానికి మంచి నటులతో పాటు, నిర్మాణ సంస్థ దొరికింది. కానీ రాహుల్ వీటిని ఉపయోగించుకోవడంలో విఫలం చెందాడు. ఎమోషన్స్ ఏమి లేకుండా మూవీని సాదాసీదాగా తెరకెక్కించాడు. కేవలం హీరో నాగార్జునను మాత్రం చూపించిన తీరు, ఆయన పాత్ర విధానం బాగుంది. మొదటి సగం ఫర్వాలేదు గానీ రెండవ భాగం మాత్రం పూర్తిగా తేల్చేశాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • నాగార్జున
  • కామెడీ
  • కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :

  • కథనం
  • ఫస్ట్ హాఫ్

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!