అలా చేస్తే బయటకి గెంటేస్తా.. విష్ణుకు వెరోనికా వార్నింగ్!

రెండో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున మంచు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన విష్ణు.. ‘‘అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది’’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా మంచు విష్ణు, విరావికా దంపతులకు ఇదివరకే ఇద్దరు అమ్మాయిలు(కవలలు), ఒక అబ్బాయి ఉన్న విషయం తెలిసిందే. It’s a GIRL!!!! It’s a GIRL!!!!!! ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️???????? — Vishnu Manchu […]

అలా చేస్తే బయటకి గెంటేస్తా.. విష్ణుకు వెరోనికా వార్నింగ్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 09, 2019 | 5:39 PM

రెండో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున మంచు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మంచు విష్ణు సతీమణి విరానికా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన విష్ణు.. ‘‘అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టింది’’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా మంచు విష్ణు, విరావికా దంపతులకు ఇదివరకే ఇద్దరు అమ్మాయిలు(కవలలు), ఒక అబ్బాయి ఉన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కాజల్‌ సలహాతో తన భార్య డెలివరీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ పెడతానంటూ గురువారం సంచలనానికి తెరలేపాడు విష్ణు. ఆ తరువాత దానికి విరావిక స్పందిస్తూ.. అలా చేస్తే నిన్ను కొట్టేస్తాను. కాజల్‌ నువ్వు ఏం అనుకోకు అని కామెంట్ పెట్టింది. దీంతో మరోసారి విష్ణు ట్వీట్ చేస్తూ.. విరావిక నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో నేను ఇన్‌స్టాలో లైవ్ చేయలేకపోతున్నాను. ఆమెను నేను పెట్టుకోలేను. ఎందుకంటే తనకు మోహన్ బాబు మద్దతు ఉందంటూ తెలిపాడు.