Nani : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నాని.. క్లారిటీ ఇచ్చిన నేచురల్ స్టార్

సూపర్ స్టార్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Nani : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నాని.. క్లారిటీ ఇచ్చిన నేచురల్ స్టార్
Nani
Follow us

|

Updated on: Jun 08, 2022 | 7:21 AM

సూపర్ స్టార్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవలే సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మే 12న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. మహేష్ మాస్ యాక్షన్ తో పాటు కామెడీతో అదరగోట్టారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా వసూళ్లను కూడా భారీగానే సాధించింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. దాదాపు 11 ఏళ్లతర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా పూజాకార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తుంది. అలాగే తమన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నాడు.

అయితే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నారన్న వార్త ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. కీలక పాత్రలో నాని నటిస్తున్నారని.. ఆయన పాత్ర సినిమాలో కీలకం గా ఉంటుందని టాక్. తాజాగా అంటే సుందరానికి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఈ వార్తల పై స్పందించాడు. మహేష్ సినిమాలో నటిస్తున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు నాని. అదంతా రూమర్స్ మాత్రమే కొట్టిపడేశాడు నాని. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి అనే సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 10న విడుదల కానుంది. ఈ సినిమాతర్వాత దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు నాని. ఈ మూవీలో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు నాని.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు