Balakrishna : అనుకున్నదానికంటే ముందుగానే రానున్న బాలయ్య సినిమా.. రిలీజ్ అప్పుడేనా..?

|

Jun 30, 2022 | 7:49 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ఇటీవలే అఖండ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య.

Balakrishna : అనుకున్నదానికంటే ముందుగానే రానున్న బాలయ్య సినిమా.. రిలీజ్ అప్పుడేనా..?
Balakrishna
Follow us on

నటసింహం నందమూరి బాలకృష్ణ( Balakrishna )సినిమా వస్తుందంటే అభిమానుల హడావిడి మాములుగా ఉండదు. ఇటీవలే అఖండ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా సంచలన విజయాన్ని అందుకుంది. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతో 200 కోట్ల క్లబ్ లోకి చేరి పోయారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సంక్రాంతి అంటే బాలయ్య సినిమా ఉండాల్సిందే. బరిలో ఎన్ని సినిమాలున్నా బాలయ్య సినిమా మాత్రం పక్కాగా ఉంటుంది. అలాగే రాబోయే సంక్రాంతి కి గోపీచంద్ మలినేని సినిమా ఉంటుందని టాక్ వినిపించింది.

బాలయ్య కెరీర్ లో 107వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్. ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఇక బాలయ్యకు ఇటీవల కొరోనా సోకిన విషయం తెలిసిందే. దాంతో షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు. వచ్చే వారం నుంచి తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారట బాలయ్య. గోపీచంద్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. ఇప్పటికే కథను సిద్ధం చేసిన అనిల్ మిగిలిన తరగణాన్ని సెట్ చేసే పనిలో ఉన్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి