ఆ యువకుడు కలలు కన్నాడు వాటిని సహకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఓ స్థాయికి చేరాడు. మరింత ఉన్నత స్థానాలు అందుకోవాలని పట్టుదలతో వెళుతున్నాడు. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మక్కువ. ఇండస్ట్రీలో రాణించాలనే పట్టుదల ఉంది. అందుకోసం పది సంవత్సరాలుగా ఎంతో కృషి చేశాడు. అంచెలంచెలుగా ఎదరుగుతూ ప్రస్తుతం సినిమా సహాయ నృత్య దర్శకుడుగా రాణిస్తున్నాడు. అతనే నంద్యాల పట్టణానికి చెందిన విశ్వనాథ్. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడీ రాయలసీయ యువకుడు. నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె ప్రాంతానికి చెందిన కొండయ్య,జయమ్మ దంపతుల కుమారుడు విశ్వనాథ్. చిన్నప్పటి నుంచి సినిమాలపైన ఉన్న మక్కువతో డ్యాన్స్ లో శిక్షణ పొందాడు. నేర్చుకున్నాడు.గత పది సంవత్సరాల కాలంగా ఎంతో శ్రమకోర్చి డ్యాన్స్ లో శిక్షణ పొందుతూ, పలు సంస్కృతిక కార్యక్రమాలలో తన ప్రతిభ చాటాడు. అంతే కాకుండా నంద్యాల పట్టణంలో నృత్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పలువురికి శిక్షణ ఇచ్చి ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రముఖ నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ డైరక్టరుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు టీవీ షోలు, పలు సినిమాల్లో తన ప్రతిభ నిరూపించుకుని పలువురి సిని రంగ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ లో డాన్స్ మా స్టర్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని విశ్వనాథ్ రాణిస్తూన్నాడు
ఇప్పటి వరకు డ్యాన్స్ షో, నీతోనే డ్యాన్స్ షోలతో ప్రతిభ చాటిన విశ్వనాథ్.తెలుగు చిత్రాలలోని సుమారు 50 సినిమాలలో డ్యాన్స్ బృందంలో నృత్యం చేశాడు. మోగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, ఆచార్య సినిమా లతో పాటు రావణాసుర,రంగ్‌దే చిత్రాల్లో తన డ్యాన్స్ తో అలరించారు. ప్రస్తుతం రవితేజ, చిరంజీవి, విశ్వక్సేన్ చిత్రాల్లో డ్యాన్స్ బృందంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.సినిమా రంగంలో గొప్ప కొరియోగ్రాఫర్ గా కొనసాగాలనే లక్ష్యం తో ముందుకెళ్తున్న విశ్వనాథ్ కు మరిన్ని అవకాశాలు వచ్చి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని తల్లిదండ్రులు, నంద్యాల వాసులు ఆకాంక్షిస్తూన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..