కొడుకు, కోడలితో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న నాగార్జున
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, శోభిత ఈనెల 4న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఇక వివాహం తర్వాత శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్.
శక్తిపీఠం జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, అమ్మవార్లను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దర్శించుకున్నారు. నిన్న వివాహం చేసుకున్న నాగచైతన్య శోభిత దంపతులు కూడా నాగార్జునతో పాటు ఉన్నారు. ఆలయంలోకి రాగానే పేద పండితులు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామి అమ్మవార్లకు నూతన దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి నేరుగా కారులో శ్రీశైలం చేరుకున్నారు. నాగార్జున రాక ను గోప్యంగా ఆలయ అధికారులు ఉంచారు. ఎంతోకాలంగా అనుకుంటున్న శ్రీశైలం దర్శనం ఎంతో సంతృప్తిని అనుభూతిని ఇచ్చిందని నాగార్జున ఆలయ అధికారులతో స్పష్టం చేశారు. దర్శనానంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది.