ప్రవీణ్ సత్తారుతో నాగార్జున ప్రాజెక్ట్ ఫిక్స్..!
టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అయిపోయాయి. గతంలో 'మనం', 'సోగ్గాడే చిన్నినాయనా', 'ఊపిరి' సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకున్నారు హీరో నాగార్జున. ఈ సమయంలో పీక్ రేంజుకి ఆయన మార్కెట్ వెళ్లింది. అలాంటిది రెండేళ్లు తిరిగేసరికి 'ఆఫీసర్' లాంటి సినిమాతో కెరీర్లోనే అత్యంత వరస్ట్ డిజాస్టర్ వస్తుందని ఆయన ఊహించి ఉండరు.

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ కామన్ అయిపోయాయి. గతంలో ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’ సినిమాలతో అద్భుతమైన విజయాలు అందుకున్నారు హీరో నాగార్జున. ఈ సమయంలో పీక్ రేంజుకి ఆయన మార్కెట్ వెళ్లింది. అలాంటిది రెండేళ్లు తిరిగేసరికి ‘ఆఫీసర్’ లాంటి సినిమాతో కెరీర్లోనే అత్యంత వరస్ట్ డిజాస్టర్ వస్తుందని ఆయన ఊహించి ఉండరు. గత ఏడాది కూడా ‘మన్మథుడు-2’ తో భారీ ప్లాప్ చవిచూశారు నాగ్. ఇప్పుడాయనకు మంచి హిట్ అవసరం. ఇక్కడి నుంచి ఆయన కెరీర్ ఎలా డిజైన్ చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజంట్ ‘మహర్షి’ మూవీకి రైటర్ గా పని చేసిన సాల్మన్‌కు దర్శకుడిగా ఫస్ట్ ఛాన్స్ ఇస్తూ వైల్డ్ డాగ్ అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు నాగ్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలావరకు కంప్లీట్ అయ్యింది. ఈ కరోనా హడావిడిగా లేకపోతే ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కూడా అయ్యిండేది. ఇంతలోనే మరో సినిమాకు రంగం సిద్దం చేస్తున్నాడు ఎవర్ గ్రీన్ మన్మథుడు.
‘గుంటురు టాకీస్’, ‘గరుడవేగ’ సినిమాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పిన ఒక కొత్త తరహా థ్రిల్లర్ కి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం కోసం రెండు బడా నిర్మాణ సంస్థలు చేతులు కలుపుతున్నాయి. ప్రజంట్ నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’ సినిమాను నిర్మించిన ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్.. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అధినేత శరత్ మరార్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తారట. త్వరలోనే ఈ సినిమా గురించి అఫిషియల్ అనౌన్సిమెంట్ రానున్నట్లు సమాచారం.




