Bigg Boss 5 telugu: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ పర్యావరణం పై అవగాహనా కల్పిస్తూ.. అందరి చేత మొక్కలు నటిస్తున్నారు తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. ఇప్పటివరకు సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు పలువురు ప్రముఖులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నేడు (శనివారం ) నాగార్జున హోస్ట్ గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కు హాజరు కానున్నారు. నేడు టెలికాస్ట్ అవ్వనున్న బిగ్ బాస్ షోలో జోగినపల్లి సంతోష్ కుమార్ సందడి చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు నిర్వాహకులు.
ఇక నాగార్జున హోస్ట్ గా టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం హౌస్ లో 6 కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ అవ్వనున్నారు. దాంతో 5 సభ్యులు హౌస్‌లో ఉంటారు . ఆతర్వాత వీరి నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవ్వనున్నారు. చివరికి ఒకరు విజేతగా నిలుస్తారు. ఈ క్రమంలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలుస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వారాంతంలో ఎంట్రీ ఇచ్చే నాగార్జున ఇంటి సభ్యులతో ఆటలాడించి రకరకాల టాస్క్ లు ఇస్తుంటారు. మరి ఈ రోజు జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ఎలా సందడి చేస్తారో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :