AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్.. అందుకే రూ.110 కోట్లకు పెట్టాం: మూవీ మేకర్స్

'నాగబంధం' కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను అద్భుతంగా నిర్మించాం. 'నాగబంధం' విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. ఆడియన్స్‌కు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి తెలిపారు. ఈ సినిమా జులై 3న విడుదల కానుంది.

ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్.. అందుకే రూ.110 కోట్లకు పెట్టాం: మూవీ మేకర్స్
Naga Bandham
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2026 | 3:06 PM

Share

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.32 కోట్లు పెడితే ఏకంగా రూ.456కోట్లు వసూల్ చేసింది.. ఓటీటీలోనూ తోపే

నిర్మాతలు మాట్లాడుతూ.. మేము సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహించాం. అక్కడి నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత బిజినెస్‌ను డైవర్సిఫై చేయాలనే ఉద్దేశంతో సినిమా పరిశ్రమను కూడా ఒక మంచి అవకాశంగా భావించాం. నాగబంధం కంటే ముందు మరో కథ విన్నాం. అది చాలా పెద్ద హీరోతో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్. అయితే అప్పటికి మేము నిర్మాతలుగా నిరూపించుకోలేదు కాబట్టి ఆ అవకాశం రాలేదు.  రవీందర్ రెడ్డి గారు అభిషేక్ నామా గారి వద్ద ఉన్న స్క్రిప్ట్ గురించి చెప్పారు. అలా మేము అభిషేక్ గారిని కలిశాం. ఆయన విజన్ మాకు చాలా నచ్చింది. పెద్ద స్థాయిలో సినిమా చేయాలనే ఆలోచనతో నాగబంధం మొదలైంది. కథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా నమ్మకం పెరిగింది. నాగబంధం కంటెంట్ పై వున్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించాం.

ఇది కూడా చదవండి : ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

మొదటి నుంచి క్రియేటివ్ ఫీల్డ్‌పై మాకు ఆసక్తి ఉంది. అయితే కేవలం పేరు కోసం మేము ఈ రంగంలోకి రాలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలోనే మేము మంచి గుర్తింపు సంపాదించాం. బిజినెస్‌ను విస్తరించే క్రమంలో రియల్ ఎస్టేట్, ఫార్మా లాంటి రంగాలతో పాటు సినిమా కూడా ఒక మంచి రంగమని భావించాం. మాకు కంటెంట్‌పై బలమైన నమ్మకం ఉంది. లార్జర్ దాన్ లైఫ్ మైథాలజికల్ కథతో సినిమా చేయాలనే ఆలోచన మొదటి నుంచే ఉంది. అభిషేక్ నామా గారు ఇంతకుముందు డెవిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చేశారు. ఆయన విజన్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. హీరో కోసం వెతుకుతున్న సమయంలో విరాట్ కర్ణ ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనిపించారు. ఈ సినిమా కోసం ఆయన అద్భుతంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి, ఎంతో అంకితభావంతో పనిచేశారు. విజువల్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. మేము పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నిర్మించాం. మేము ఊహించిన దానికంటే గొప్పగా సినిమా వచ్చింది. నాగబంధం నిజంగా ఒక విజువల్ స్పెక్టాకిల్. ఈ సినిమాలో ప్రతి పది నిమిషాలకు ఒక అద్భుతమైన విజువల్ కనిపిస్తుంది. అలాంటి విజువల్స్‌ను అవుట్‌డోర్‌లో పొందడం సాధ్యం కాదు అని నిర్మాతలు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ స్టార్ హీరోయిన్స్‌కు మించి క్రేజ్.. కుర్రాళ్లు పడిచచ్చిపోతారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?