AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెలకు రూ.2 లక్షల జీతంతో AP విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. APSPDCL నోటిఫికేషన్ విడుదల

APSPDCL Recruitment 2026 Notification: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇది మంచి అవకాశం. APSPDCL విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి..

నెలకు రూ.2 లక్షల జీతంతో AP విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు.. APSPDCL నోటిఫికేషన్ విడుదల
APSPDCL AEE Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 28, 2026 | 3:17 PM

Share

ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APSPDCL) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

ఈ నియామక ప్రక్రియలో మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) 125 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 6 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (టెలికాం) 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఈ లేదా బీటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 2026 జులై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద అప్లికేషన్ ప్రాసెసింగ్, కామన్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహణ కోసం రూ.1,000 చెల్లించాలి. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 కన్సాలిడేటెడ్ వేతనం చెల్లిస్తారు. అనంతరం రెగ్యులర్ పే స్కేల్ రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు వర్తిస్తుంది.

ముఖ్యాంశాలు

  • మొత్తం పోస్టుల సంఖ్య: 135
  • పోస్టులు: AEE (ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం)
  • అర్హత: సంబంధిత విభాగంలో BE/B.Tech
  • వయోపరిమితి: 18–42 ఏళ్లు
  • ఎంపిక విధానం: CBT రాత పరీక్ష
  • ప్రొబేషన్ వేతనం: నెలకు రూ.75,000
  • రెగ్యులర్ పే స్కేల్: రూ.86,245 నుంచి రూ.2,08,915 వరకు
  • దరఖాస్తు ప్రారంభం: జూన్ 30, 2026
  • దరఖాస్తు చివరి తేదీ: జులై 20, 2026

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
ఉద్యోగాల జాతర.. DIETల్లో లెక్చరర్‌ ఉద్యోగాలకు TGPSC నోటిఫికేషన్‌
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!