కల్కిలో ముందు ఆ రోల్ రిజెక్ట్ చేశా.. తర్వాతే బుజ్జి పాత్ర వచ్చింది.. 

Rajitha Chanti

Pic credit - Instagram

28 Jun 2026

ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. 

దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతమైన సృష్టిగా, రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం విడుదలై జూన్ 28తో విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ వెహికల్ 'బుజ్జి' పాత్రకు తన గొంతుతో ప్రాణం పోసిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ 

కీర్తి సురేష్ మాట్లాడుతూ, నాగ్ అశ్విన్ మొదట 'కల్కి' సినిమాలో తనను బుజ్జి పాత్ర కాకుండా వేరొక నటన ప్రాధాన్యత ఉన్న పాత్ర చేయమని అడిగారని వెల్లడించారు.

అయితే, ఎందుకో ఆ పాత్రపై తనకు పూర్తి నమ్మకం కలగకపోవడంతో ఆమె దానిని సున్నితంగా తిరస్కరించారు. కానీ, మరుసటి రోజే నాగ్ అశ్విన్ మళ్లీ వచ్చి, "సినిమాలో మరో అద్భుతమైన పాత్ర ఉంది

కనీసం ఇదైనా చేస్తావా?" అని అడిగారట. నాగ్ అశ్విన్ విజన్‌పై ఉన్న నమ్మకంతో, ఆయన సినిమాలో ఎలాగైనా భాగం కావాలని కీర్తి భావించారు.

తాను మొదటి పాత్రను తిరస్కరించడమే మంచిదయిందని, దానివల్లే తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన 'బుజ్జి' పాత్ర లభించిందని కీర్తి సురేష్ సంతోషం వ్యక్తం చేశారు. 

షూటింగ్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదా అని అడగగా, "నాకు కేవలం నీ వాయిస్ మాత్రమే కావాలి" అని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ సరికొత్త ప్రయోగం నచ్చి ఆమె వెంటనే ఓకే చెప్పారు.