AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nag Ashwin: శుభవార్త చెప్పిన ‘కల్కి’ డైరెక్టర్.. మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్ శుభవార్త చెప్పారు. మహానటి, కల్కి సినిమాలతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ త్వరలోనే మరోసారి తండ్రి గా ప్రమోషన్ పొందనున్నారు. ఆయన భార్య ప్రియాంక ప్రస్తుతం గర్భంతో ఉందన్న విషయాన్ని స్వయంగా నాగ్ అశ్వినే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

Nag Ashwin: శుభవార్త చెప్పిన 'కల్కి' డైరెక్టర్.. మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
Nag Ashwin
Basha Shek
|

Updated on: Jun 28, 2026 | 3:25 PM

Share

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నాగ్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు సాధించింది. ఇక ప్రభాస్ హీరోగా అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898ఏడీ’ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. 2024లో రిలీజైన ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో బిజిగా ఉన్న నాగ్ అశ్విన్ ఒక తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఒక శుభవార్త చెప్పాడు. తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన భార్య ప్రియాంక ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోని పంచుకున్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు నాగ్ అశ్విన్- ప్రియాంక దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా షూటింగ్ టైమ్ లోనే నిర్మాత అశ్వనీదత్ కూతురు ప్రియాంకతో ప్రేమలో పడ్డారు నాగ్ అశ్విన్. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో 2015లో పెళ్లిపీటలెక్కారు. వీరికి 2017లో కొడుకు పుట్టాడు. కాగా తనకు డైరెక్టర్ గా గుర్తింపు తీసుకొచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు పెట్టిన రిషి అనే పేరుని నాగ్ అశ్విన్ తన కుమారుడికి పెట్టడం విశేషం. ఇప్పుడు మరోసారి తల్లిదండ్రులు కాబోతుండడంతో నాగ్ అశ్విన్- ప్రియాంక ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, కుమారుడితో డైరెక్టర్ నాగ్ అశ్విన్..

View this post on Instagram

A post shared by nagi (@nag_ashwin)

కాగా కేవలం డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు నాగ్ అశ్విన్. అందులో భాగంగానే జాతిరత్నాలు సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఇక రీసెంట్ గా సింగ్ గీతం అనే సినిమాను కూడా నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది.

View this post on Instagram

A post shared by nagi (@nag_ashwin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
మరోసారి తండ్రి కానున్న నాగ్ అశ్విన్.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినరు? అసలు కారణం ఇదే!
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
మొదటిసారి భర్త ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసిన జబర్దస్త్ ఫైమా..
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
టీమిండియాకు బిగ్ షాక్.. 2వ మ్యాచ్ ఆడకుండానే సిరీస్ కోల్పోయిందిగా?
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
నెలకు రూ.2 లక్షల జీతంతో AP SPDCL విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
ఎక్కడ చూసిన ఈ మూవీ పేరే వినిపిస్తుంది
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
సినిమా ప్లాప్ అన్నారు.. కానీ ఒక్క ఆ ప్రమోషన్‏తో బాక్సాఫీస్ షేక్ చ
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
మీ లైఫ్‌లో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూసి ఉండరు!
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?
కలలో పెళ్లి కనిపిస్తే శుభమా? అశుభమా? ఈ సంకేతాల అర్థం తెలుసా?