Naga Babu: “ఏపాటి వాడికైనా చిరంజీవిని చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే”.. నాగబాబు కౌంటర్ ఆయనకేనా..

చిరంజీవిని ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు దత్తన్న. అలాగే ఇదే కార్యక్రమానికి గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు.

Naga Babu: ఏపాటి వాడికైనా చిరంజీవిని చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే.. నాగబాబు కౌంటర్ ఆయనకేనా..
Nagababu

Updated on: Oct 06, 2022 | 7:10 PM

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ లో ఆసక్తికర విషయం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. చిరంజీవిని ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు దత్తన్న. అలాగే ఇదే కార్యక్రమానికి గరికపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. తన ప్రవచనాలతో.. ప్రవచనాల మధ్యలో వేసే చమత్కారాలతో.. విమర్శలతో వి విపరీతంగా పాపులర్ అయిన గరికపాటి.. ఉన్నట్టుండి దత్తన్న అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో సీరియస్ అయ్యారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి పైనే గరం గరం అయ్యారు. ఇలా అయితే నేను వెళ్లిపోతా అంటూ.. హెచ్చరించారు.

ఓ పక్క తాను మాట్లాడడానికి రెడీ అయి మైకు ముందు కూర్చుంటే.. మరో వైపు చిరంజీవి వెంట పడి మరీ.. ఆయన అభిమానులు ఆయనతో ఫోటోలు దిగుతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక ఇది గమనించిన గరికపాటి.. మీ ఫోటో సెషన్ అయిపోతే నేను మాట్లాడతా.. అంటూ.. అరిచారు. చిరంజీవిని ఉన్నపళంగా అక్కడి నుంచి వచ్చి తన పక్కన కూర్చోండని ఆర్డరేశారు. లేదంటే.. నాకు సెలవు ఇప్పించండి.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా అన్నారు. దీంతో చిరంజీవి వెంటనే వచ్చి గరికపాటి తో మాట్లాడి.. ఆయన పక్కనే కూర్చున్నారు. అయితే ఈ విషయం పై మెగా బ్రదర్ నాగబాబు పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ చూస్తే.. ఆపాటి అసూయ పడడం పరిపాటే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి