Buchi Babu Sana: ఇల్లు కావాలా.. లేదా కారు కావాలా.? ‘ఉప్పెన’ దర్శకుడికి నిర్మాణ సంస్థ బంపరాఫర్.!
Buchi Babu Sana: మెగా హీరో వైష్ణవ్ తేజ్, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా 'ఉప్పెన'. ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల..

Buchi Babu Sana: మెగా హీరో వైష్ణవ్ తేజ్, అందాల భామ కృతిశెట్టి హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్రంతో బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచమయ్యాడు. సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు.. మొదటి సినిమానే అయినా ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల చేత, సినీ పెద్దల చేత శభాష్ అనిపించుకున్నాడు.
ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో 30 కోట్లకి పైగా షేర్‌ను .. 50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కథాకథనాలను ఆసక్తికరంగా నడిపించడంలో .. పాత్రలను మలిచిన తీరులో దర్శకుడు బుచ్చిబాబు కనబరిచిన ప్రతిభను అందరు కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమాను తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ దర్శకుడు బుచ్చిబాబు సానాకు బహుమతులు ఇవ్వనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇల్లు, లేదా కారులో ఒకటి కోరుకోవాలని అడిగినట్లు సమాచారం. కాగా, గతంలో పలువురు హీరోలు, నిర్మాణ సంస్థలు యువ దర్శకులను ప్రోత్సహించే క్రమంలో బహుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మరిన్ని చదవండి:
‘అత్మనిర్భర్ భారత్’కు కేంద్రం మరో ముందడుగు.. మ్యాపింగ్ విధానంలో కీలక మార్పులు..
ముచ్చటపడి రూ. 100 కోట్ల విల్లా కొన్నాడు.. మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు…
భర్తతో కలిసి ఫేవరెట్ ప్లేస్‌లో కాజల్ డిన్నర్ డేట్.. అదేంటో మనం కూడా చూసేద్దాం..!