Dhoni- Thaman: ఎంఎస్‌ ధోనీతో సెల్ఫీ దిగిన థమన్‌.. నా క్రికెట్‌ దేవుడిని కలిశానంటూ ఎమోషనల్‌

థమన్‌కు క్రికెట్‌ అంటే బాగా ఆసక్తి. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లోనూ తెలుగు వారియర్స్‌ తరఫున మ్యాచ్‌లు ఆడి తనలోనూ ఓ క్రికెటర్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు. తాజాగా తాను ఎంతగానో అభిమానించే క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని కలిశాడు థమన్‌.

Dhoni- Thaman: ఎంఎస్‌ ధోనీతో సెల్ఫీ దిగిన థమన్‌.. నా క్రికెట్‌ దేవుడిని కలిశానంటూ ఎమోషనల్‌
Dhoni, Thaman
Follow us
Basha Shek

|

Updated on: May 10, 2023 | 5:45 AM

తన మ్యూజిక్‌తో సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తూ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారిపోయాడు ఎస్‌.ఎస్‌.థమన్‌. ఈ మధ్యన ఆయన బీజీఎం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లతో సినిమాలను మరో రేంజ్‌కు తీసుకెళుతున్నాడు. బాలయ్యతో తీసిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలే ఇందుకు నిదర్శనం. కాగా థమన్‌కు క్రికెట్‌ అంటే బాగా ఆసక్తి. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లోనూ తెలుగు వారియర్స్‌ తరఫున మ్యాచ్‌లు ఆడి తనలోనూ ఓ క్రికెటర్‌ ఉన్నాడని నిరూపించుకున్నాడు. తాజాగా తాను ఎంతగానో అభిమానించే క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీని కలిశాడు థమన్‌. అతనితో సరదాగా సెల్ఫీ కూడా దిగాడు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. మై మ్యాన్‌.. మై క్రికెట్‌ గాడ్‌.. మన ఎస్‌ ధోనీ.. నా కళ నిజమైన వేళ.. నా హృదయం ఆనందంతో ఉరకలు వేస్తోంది.. అంటూ ధోనీతో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. మీ మిలియన్ల మంది వీరాభిమానుల్లో ఒకరైన (థమన్‌) అభిమానిని హ్యాపీగా ఉంచిన ప్రియమైన ఎంఎస్‌ ధోనీకి ధన్యవాదాలు.. నా కల నెరవేరేందుకు సహకరించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు థమన్‌.

ప్రస్తుతం ధోని, థమన్‌ కలిసున్న ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి అటు క్రికెట్‌ లవర్స్‌, ఇటు మ్యూజిక్‌ లవర్స్‌ తెగ సంబరపడిపోతుఉన్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ధోనినే తన అభిమాన క్రికెటర్‌ అని చెప్పుకొచ్చాడు థమన్‌. ఇక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి వారసుడు, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకున్నాడు థమన్‌. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ తో గేమ్‌ ఛేంజర్‌, అలాగే మహేశ్‌ బాబు నటిస్తోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాలకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!