విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తరుణం కళ్లముందు చేరింది. కోట్లాది మంది ప్రజల కోరిక నెరవేరింది. జక్కన్న సృష్టించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కైవలం చేసుకుంది. ఇండియన్ సినిమాకు కొన్నేళ్లుగా కలగా మిగిలిన ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ చిత్రం సాకారం చేసింది. హాలీవుడ్ చిత్రాల్లోని పాటలను ఢీకొట్టి మరీ అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డ్ అందుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు అని ప్రకటించగానే.. డాల్బీ థియేటర్ మొత్తం కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఆస్కార్ అందుకున్న చిత్రయూనిట్ సంతోషంతో గంతులేసింది.
ఆస్కార్ అవార్డు అందుకోవడానికి వేదికపైకి చేరుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. గేయ రచయిత చంద్రబోస్. ఈ సందర్భంగా కీరవాణి తన మనసులోని సంతోషాన్ని పాట రూపంలో బయటపెట్టారు. “నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని. ఆర్ఆర్ఆర్ సినిమా భారతీయులను గర్వపడేలా చేసింది. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది.. థాంక్యూ కార్తికేయ ” అంటూ పాట రూపంలో చెప్పారు. చివరిలో నమస్తే అంటూ చంద్రబోస్ ముగించారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ టీంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తున్నారు. కోట్లాది మంది హృదయాలు ఉప్పొంగుతున్నాయని.. భారత్ ఎప్పటికీ ఒక కల అని భావించేది.. కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
#NaatuNaatu wins the #Oscar for best Original Song ?#SSRajamouli & team has done it???
Indian Cinema on the Rise ? !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe
— Abhi (@abhi_is_online) March 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.