Natu Natu song: అది మాస్ సాంగ్.. డాన్స్ వేసే పాట.. అవార్డు వస్తుందని అనుకోలేదు.. కీరవాణి కామెంట్స్

రికార్డులన్నింటిని బద్దలు కొట్టేస్తూ.. నోటబుల్ వ్యూస్‌ను సాధించేస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు.. రిలీజైన పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో.. కూడా ఈ సాంగ్ రచ్చ రచ్చ చేస్తోంది.

Natu Natu song: అది మాస్ సాంగ్.. డాన్స్ వేసే పాట.. అవార్డు వస్తుందని అనుకోలేదు.. కీరవాణి కామెంట్స్
Keeravani
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2023 | 8:11 PM

ప్రస్తుతం నాటు సాంగ్ యూట్యూబ్‌ను అల్లకల్లోలం చేస్తోంది. రికార్డులన్నింటిని బద్దలు కొట్టేస్తూ.. నోటబుల్ వ్యూస్‌ను సాధించేస్తోంది. ఒక్క తెలుగులోనే కాదు.. రిలీజైన పాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో.. కూడా ఈ సాంగ్ రచ్చ రచ్చ చేస్తోంది. త్రూ అవుట్ ఇండియా అన్ని రీజియన్స్‌లో ట్రెండింగ్ లిస్టులోకి ఎక్కేస్తోంది. సినిమా రిలీజ్‌కు ముందు నాటు ప్రోమోతో స్టార్ట్ అయిన ఈ సాంగ్ జర్నీ.. సినిమా రిలీజ్‌తో నెక్ట్స్‌ లెవల్‌కు వెళ్లింది. ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో ఫుల్ సాంగ్ రిలీజ్‌తో మరో హాట్ టాపిక్ గా మారింది.

చెర్రీ- తారక్ కష్టపడి మరీ ఒకే రిథమ్ తో డ్యాన్స్ చేసిన నాటు సాంగ్ ట్రిపుల్ మూవీకే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారింది. థియేటర్లో మెగా నందమూరి ఫ్యాన్స్ ను ఊగిపోయేలా చేసింది. ఇక ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ అవడంతో ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ ను సొంతం చేసుకుంది ఈ పాట. తాజాగా ఈ సాంగ్ గురించి సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘నాటు నాటు’ పాట పూర్తి మాస్‌ సాంగ్‌. ఎవ్వరైనా డ్యాన్స్‌ వేయాలనిపించే సాంగ్‌. టెక్నికల్‌గా చెప్పాలంటే శాస్త్రీయ సంగీతం, అద్భుతమైన కవిత్వం, ఇంకా కష్టమైన ఆర్కెస్ట్రేషన్‌కు ఆస్కార్‌ అవార్డులు వస్తాయని మీరు అనుకుంటారు. అయితే, ‘నాటు నాటు’ అదిరిపోయే కమర్షియల్‌ సాంగ్‌. ఫాస్ట్‌ బీట్‌ నంబర్‌. ఆస్కార్‌ అవార్డు గురించి పక్కన పెడితే . అసలు అవార్డు వస్తుందని కలలో కూడా ఊహించలేదు అన్నారు కీరవాణి. ఇప్పుడు కీరవాణి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.