ఖమ్మం జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కేసీఆర్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరించాలని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.