తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ పొగమంచు రహదారులను కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాంధ్రలో సింగిల్ డిజిట్, తెలంగాణలో 11 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంక్రాంతి ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వెలువడ్డాయి.