AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GV Prakash: వ్యక్తిగత విషయాలపై దిగజారి మాట్లాడుతున్నారు.. జీవీ ప్రకాష్ సీరియస్..

అవగాహన లేకుండా.. సరైన కారణాలు కూడా లేకుండా రెండు మనసుల గురించి బహిరంగంగా చర్చ జరగడం దురదృష్టకరం. సెలబ్రెటీ అనే కారణంతో అతడి జీవితంలోకి చొరబడి మరీ దిగజారి విమర్శలు చేయడం సరైనది కాదు. మాటల ద్వారా తమ ఊహలకు రూపం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి జీవితాన్ని మీ మాటలు ఎంతగా ప్రభావితం చేస్తాయో గ్రహించలేనంతా

GV Prakash: వ్యక్తిగత విషయాలపై దిగజారి మాట్లాడుతున్నారు.. జీవీ ప్రకాష్ సీరియస్..
Gv Prakash
Rajitha Chanti
|

Updated on: May 15, 2024 | 5:49 PM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్, భార్య సైంధవి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు తమ సోషల్ మీడియా ఖాతాలలో అధికారిక ప్రకటన చేశారు. దీంతో వీరిద్దరి డివోర్స్ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. విడిపోయారని తెలిసినప్పటి నుంచి అందుకుగల కారణాలపై అనేక రకాల చర్చలు నడుస్తున్నాయి. జీవీ ప్రకాష్ మరో మహిళతో ప్రేమలో ఉన్నాడని.. అందుకే వీరిద్దరు విడిపోయారంటూ ఓ పోస్ట్ నెట్టింట వైరలయ్యింది. తమ డివోర్స్ పై జరుగుతున్న అసత్యాలపై జీవీ ప్రకాష్ సీరియస్ అయ్యారు. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలో జరిగే విషయాల గురించి దిగజారి మాట్లాడుతున్నారని… సెలబ్రెటీల జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అవసరమా అంటూ ఫైర్ అయ్యారు.

జీవీ ప్రకాష్, సైంధవి స్కూల్ ఫ్రెండ్స్. దాదాపు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరు 2013లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి అన్వి అనే కుమార్తె ఉంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే వీరిద్దరు డివోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యింది. వీరి డివోర్స్ రూమర్స్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా తమ డివోర్స్ పై జరుగుతున్న చర్చపై జీవీ రియాక్ట్ అయ్యాడు.

“అవగాహన లేకుండా.. సరైన కారణాలు కూడా లేకుండా రెండు మనసుల గురించి బహిరంగంగా చర్చ జరగడం దురదృష్టకరం. సెలబ్రెటీ అనే కారణంతో అతడి జీవితంలోకి చొరబడి మరీ దిగజారి విమర్శలు చేయడం సరైనది కాదు. మాటల ద్వారా తమ ఊహలకు రూపం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ వ్యక్తి జీవితాన్ని మీ మాటలు ఎంతగా ప్రభావితం చేస్తాయో గ్రహించలేనంతా నిరుత్సాహా స్థితిలో ఉన్నారా.. ? వారిద్దరి పరస్పర అంగీకారం వెనుక ఉన్న కారణాలు వారి స్నేహితులు, బంధులు, కుటుంబసభ్యులకు తెలిస్తే చాలు. వారందరిని సంప్రదించిన తర్వాతే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వ్యక్తిగత జీవితంపై పక్షపాతంతో చేసిన విమర్శలైనా వారి హృదయాలను గాయపరిచేలా ఉన్నాయి. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నాను. న్యాయంగా ఉండండి.. ప్రతి ఒక్కరిని గౌరవించండి. మీ ప్రేమకు నా ధన్యవాదాలు ” అంటూ సుధీర్ఘ నోట్ షేర్ చేశాడు జీవీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.