Devara : దేవర టీజర్ మంటలురేపడం ఖాయం.. వైరల్ అవుతున్న అనిరుధ్ ట్వీట్
దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవర సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర సినిమాను కొరటాల శివ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవర సినిమా సముద్రం బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తుంది. దేవర మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.
దేవర మూవీ నుంచి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత ఇంత వరకు మరో పోస్టర్ కానీ, ఏదైనా అప్డేట్ కానీ వదల్లేదు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దేవర సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా దేవర మూవీ టీజర్ గురించి అనిరుధ్ ఓ ఇంట్రెస్టింట్ పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దాంతో దేవర మూవీ పై హైప్ భారీగా పెరిగిపోయింది. దేవర మూవీ టీజర్ త్వరలోనే రిలీజ్ చేయడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. ఈ మేరకు అనిరుధ్ ట్వీట్ చేస్తూ.. ‘దేవర టీజర్… ఎగ్జైటెడ్’ అని ట్వీట్ చేశారు. అలాగే ఫైర్, చప్పట్లు కొడుతున్న ఎమోజిలను షేర్ చేశారు అనిరుధ్. ఇప్పుడు తీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#Devara teaser 👏👏👏@tarak9999 and #KoratalaSiva 🔥🔥🔥 Excited 🎶🥁🙌#AllHailTheTiger
— Anirudh Ravichander (@anirudhofficial) December 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..