AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది.. మళ్లీ అలాంటిది రాకూడదు

మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. ఇటీవలే డర్టీ హరి, వాన వంటి సినిమాలకు దర్శకత్వం కూడా వచించారు.

ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది.. మళ్లీ అలాంటిది రాకూడదు
Ms Raju
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 9:34 AM

Share

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎం.ఎస్. రాజు, ఓ ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని పలు కీలక ఘట్టాలపై సంచలన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.., ‘దేవి’ సినిమా షూటింగ్‌లో పాముకు బొట్టు పెట్టే సన్నివేశం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. అది గ్రాఫిక్స్ కాదని, నిజంగానే పాముకు బొట్టు పెట్టారని, ఆ పాము ఒకరిని కాటు కూడా వేసిందని ఎం.ఎస్. రాజు తెలిపారు. ఆ షాట్ గ్రాఫిక్స్ షాట్ కాదని, ఆ నటి కూడా భయపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘దేవి’ సినిమా తనకెన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చిందని, ఆ సమయంలో పడిన కష్టాలు తనను మానసికంగా, శారీరకంగా ఎంతగానో ప్రభావితం చేశాయని గుర్తు చేసుకున్నారు. ఒక సందర్భంలో మానసిక అలసట వల్ల కారు ప్రమాదం కూడా చేశానని తెలిపారు. ఇది తన జీవితంలో ఒక మూడేళ్ల కఠినమైన ప్రయాణమని, అటువంటి అనుభవం మళ్లీ రాకూడదని ఎం.ఎస్. రాజు అన్నారు.

‘దేవి పుత్రుడు’ సినిమా తనకెంతో అనుభవాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా పరిష్కరించాలి అనే పాఠాలను నేర్పిందని రాజు అన్నారు. ఈ సినిమా అందరికీ నచ్చినా, చివరి అరగంట తనకు నచ్చలేదని, అదే సినిమా పరాజయానికి ఒక కారణమై ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ‘దేవి పుత్రుడు’ ఫ్లాప్ అయిన తర్వాత వెంకటేష్ గారు తనతో ‘మరింత బాగా చేసి ఉండాల్సింది’ అని మాత్రమే అన్నారని, అంతకుమించి ఇంకేమీ మాట్లాడలేదని తెలిపారు. ఈ సినిమా గ్రాఫిక్స్ పరంగా, కథ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇప్పటికీ తనకి పూర్తిగా అర్థం కాలేదని పేర్కొన్నారు.

‘మనసంతా నువ్వే’ సినిమా తన కెరీర్‌లో ఒక మలుపు అని ఎం.ఎస్. రాజు అన్నారు. ఆ సినిమా ఆలోచన 1954 నాటి హిందీ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘అన్మోల్ ఘడి’ నుండి స్ఫూర్తి పొందిందని వెల్లడించారు. అందులో పిల్లలు, వాచ్ ఐడియాను మాత్రమే తీసుకుని, మిగతా కథను పూర్తిగా తనదైన శైలిలో అల్లారని తెలిపారు. ఈ కథను ముందుగా పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, ఆ తర్వాత ఎస్. గోపాల్ రెడ్డి గారికి చెప్పారని, ఇద్దరూ అంగీకరించిన తర్వాత దర్శకుడి కోసం అన్వేషణ మొదలైందని అన్నారు. ‘దేవి పుత్రుడు’ పరాజయం తర్వాత తాను స్వయంగా దర్శకత్వం వహించడానికి ఇష్టపడలేదని, ఆ సమయంలో ఎస్. గోపాల్ రెడ్డి గారు వి.ఎన్. ఆదిత్య పేరును సూచించారని వివరించారు. ఆదిత్య తన ఆలోచనలను అర్థం చేసుకోగల సమర్థుడని గోపాల్ రెడ్డి గారు చెప్పడంతో, ఆదిత్యను పిలిపించి కథ చెప్పగా, తక్షణమే అంగీకరించారని, అలా ‘మనసంతా నువ్వే’ ప్రయాణం మొదలైందని ఎం.ఎస్. రాజు పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?
తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.
తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.
Viral Video: గుండె గట్టిగా ఉన్నోళ్లే ఈ వీడియో చూడండి..
Viral Video: గుండె గట్టిగా ఉన్నోళ్లే ఈ వీడియో చూడండి..
బాసరలో చారిత్రక ఘట్టం..బాలాలయంలోకి చదువుల తల్లి,గర్భగుడి మూసివేత!
బాసరలో చారిత్రక ఘట్టం..బాలాలయంలోకి చదువుల తల్లి,గర్భగుడి మూసివేత!
వెక్కి వెక్కి ఏడుస్తూ రిటైర్మెంట్ ప్రకటన
వెక్కి వెక్కి ఏడుస్తూ రిటైర్మెంట్ ప్రకటన