Mohanlal: మార్షల్ ఆర్ట్స్‌లో మేటి.. రైటర్ కూడా.. ఇప్పుడు సినిమాల్లోకి.. మోహన్ లాల్ కూతురు లేటెస్ట్ ఫొటోస్ వైరల్

65 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తున్నారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. మోహన్ లాల్ సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పటికే ఆయన కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Mohanlal: మార్షల్ ఆర్ట్స్‌లో మేటి.. రైటర్ కూడా.. ఇప్పుడు సినిమాల్లోకి.. మోహన్ లాల్ కూతురు లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Mohanlal Daughter Vismaya

Updated on: Jul 02, 2025 | 6:45 AM

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఎప్పుడూ ఉండేదే. చాలామంది స్టార్ హీరోలు/ హీరోయిన్ల పిల్లలు సినిమాలనే తమ కెరీర్ గా ఎంచుకుంటున్నారు. అమ్మానాన్నల బాటలోనే నడుస్తూ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ఇప్పుడు మరో స్టార్ హీరో కుటుంబం నుంచి మరో వారసురాలి ఎంట్రీ ఇవ్వనుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూతురు విస్మయ తెరపై అరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యింది. తుడక్కం అనే సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని జూడే ఆంథానీ జోసెఫ్ తెరకెక్కించనున్నారు. ఆయన గతంలో సారాస్‌, 2018 వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మోహన్ లాల్ కూతురును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. విస్మయ మోహన్ లాల్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు తమకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది. ఇక నటుడు మోహన్ లాల్ కూడా ఈ సంతోషకరమైన వార్తను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ విస్మయకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

విస్మయ ఇప్పటికే రచయితగా రాణిస్తోంది. ఆమె తొలి పుస్తకం ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల అయ్యింది. అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్ లోనూ నైపుణ్యం సాధించింది. థాయ్‌లాండ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటేందుకు రెడీ అయ్యిందీ స్టార్ కిడ్. కాగా విస్మయ సోదరుడు, మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఇప్పటికే సినిమాల్లో ఉన్నాడు. జీతు జోసెఫ్ తెరకెక్కించిన ‘ఆది’మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు ప్రణవ్. ప్రస్తుతం డైస్‌ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు.

కూతురు విస్మయతో మోహన్ లాల్..

ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్ కొట్టారు. తర్వాత తుడురుమ్ సినిమాతోనూ ఆడియెన్స్ ను అలరించారు.

మోహన్ లాల్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.