AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehreen Pirzada: మెహరీన్‌ ప్రియుడు తనకు ఎలా ప్రపోజ్‌ చేశాడో చూశారా..? ఇలా చేస్తే ఎందుకు ఓకే చెప్పరు చెప్పండి..

Mehreen Pirzada Love: నాని హీరోగా తెరకెక్కిన 'క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ మెహరీన్‌. అనంతరం 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్‌' వంటి చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ..

Mehreen Pirzada: మెహరీన్‌ ప్రియుడు తనకు ఎలా ప్రపోజ్‌ చేశాడో చూశారా..? ఇలా చేస్తే ఎందుకు ఓకే చెప్పరు చెప్పండి..
Mehreen Pirzada
Narender Vaitla
|

Updated on: Mar 21, 2021 | 1:52 AM

Share

Mehreen Pirzada Love: నాని హీరోగా తెరకెక్కిన ‘క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల భామ మెహరీన్‌. అనంతరం ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’ వంటి చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక ‘ఎఫ్‌2’లో ‘హనీ ఈజ్‌ ది బెస్ట్‌’ అంటూ తన కామెడీతోనూ ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ పంజాబీ ముద్దుగుమ్మ తాజాగా వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక మెహరీన్‌ది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. భవ్య బిష్ణోయ్‌తో గత కొన్ని నెలల క్రితమే ప్రేమలో పడ్డ మెహరీన్‌.. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లింది. కేవలం పది నెలల సమయంలోనే ప్రేమించికోవడం, పెళ్లి చేసుకోవడం అంతా జరిగిపోయింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన ఈ చిన్నది తన ప్రేమకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పది నెలల కాలంలోనే భవ్యతో తనకు జీవిత కాల అనుబంధం ఏర్పడిందని చెప్పిందీ బ్యూటీ. ఇక తామిద్దిరకి లాక్‌డౌన్‌ సమయంలో పరిచయం కావడంతో ఎక్కువగా కలుసుకోలేకపోయామని.. కానీ ఫోన్‌ ద్వారా అభిరుచుల్ని పంచుకునే వాళ్లమని చెప్పింది. ఇక మెహరీన్‌ తనకు కాబోయే వాడు లవ్‌ ప్రపోజల్‌ ఎక్కడ చేశాడన్న దానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. భవ్య బిష్ణోయ్‌ పుట్టిన రోజు సందర్భంగా అండమాన్‌ వెళ్లిన సమయంలో వీరిద్దరూ క్యూబా డైవింగ్‌ చేశారట.. ఆ సమయంలోనే సముద్ర గర్భంలో మెహరీన్‌కు ప్రపోజ్‌ చేశాడు. మోకాలిపై కూర్చొని ‘విల్‌ యూ మ్యారీ మీ’ అంటూ తన ప్రేమను వ్యక్త పరిచాడు. దీంతో తొలుత ఆశ్చర్యానికి గురైనా అనంతరం అతని ప్రపోజ్‌కు మెహరీన్‌ ఓకే చెప్పేసింది. ఇక ఈ జంట వచ్చే వింటర్‌లో పెళ్లిపీటలెక్కనున్నారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు మెహరీన్‌ చెప్పుకొచ్చింది. ఇక ఈ అందాల భామ సినిమా విషయాలకొస్తే.. ప్రస్తుతం ‘ఎఫ్‌-3’ చిత్రంలో నటిస్తోంది. మరి వివాహం తర్వాత మెహరీన్‌ సినిమాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Mehreen About Her Love

Mehreen About Her Love

Also Read: Suja Varunee : వెంకటేష్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. దృశ్యం 2లో కీలక పాత్రలో ఆ భామ

Ravi Teja Khiladi: శరవేగంగా రవితేజ సినిమా.. ఇట‌లీలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో మాస్ రాజా ‘ఖిలాడి’ షూటింగ్..

Uppena Movie: ‘ఉప్పెన’ క్లోజింగ్ కలెక్షన్స్.. అరుదైన ఫీట్ అందుకున్న మెగా హీరో..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. ఎప్పటినుంచంటే..?
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ప్రజా సమస్య పరిష్కారానికి పొర్లుదండాలతో నిరసన..
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఇంట్లోని పగిలిన ఇత్తడి విగ్రహాలను ఏం చేయాలి?
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి
ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లే.. జాగ్రత్తపడాలి