AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi : టాలీవుడ్ దర్శకుల పై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్.. అతన్ని చూసి నేర్చుకోవాలంటూ..

మొన్నామధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఈ సినిమా సక్సెస్ అభిమానులకు సరిపోలేదు. దాంతో మెగాస్టార్ నుంచి భారీ హిట్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ దర్శకుల పై ఇప్పటికే పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు. తాజాగా మరోసారి టాలీవుడ్ దర్శకుల పై క్రేజీ కామెంట్స్ చేశారు మెగాస్టార్.

Chiranjeevi : టాలీవుడ్ దర్శకుల పై మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్.. అతన్ని చూసి నేర్చుకోవాలంటూ..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2024 | 11:54 AM

Share

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తనను ఎంతగానో అభిమానించే ఫ్యాన్స్ కోసం ఓ భారీ హిట్ అందించాలని ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిరు నటించిన సినిమాలని బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. మొన్నామధ్య వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఈ సినిమా సక్సెస్ అభిమానులకు సరిపోలేదు. దాంతో మెగాస్టార్ నుంచి భారీ హిట్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ దర్శకుల పై ఇప్పటికే పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు. తాజాగా మరోసారి టాలీవుడ్ దర్శకుల పై క్రేజీ కామెంట్స్ చేశారు మెగాస్టార్. గతంలో ఆచార్య సినిమా సమయంలోనూ దర్శకుల పై షాకింగ్ కామెంట్స్ చేశారు చిరంజీవి.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్.  మానుషి చిల్లర్, రుహానీ శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మార్చి 1న ఆపరేషన్ వాలంటైన్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో మెగాస్టార్ మాట్లాడుతూ.. టాలీవుడ్ దర్శకుల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కేవలం 75 రోజుల్లోనే తెరకెక్కించారు శక్తి. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించాడు దర్శకుడు. విజువల్స్‌ చూస్తుంటే చాలా గ్రాండ్ గా ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో శక్తి ఇలాంటి సినిమా చేయడం చాలా గ్రేట్ అన్నారు చిరు. శక్తి ని చూసి టాలీవుడ్ దర్శకులు నేర్చుకోవాలని అన్నారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెడితేనే సినిమాకు రిచ్‌నెస్‌ రాదు. తక్కువ బడ్జెట్‌లో కూడా ఇలా సినిమా తీసి ఎలా రిచ్‌గా చూపించాలో తెలిసుండాలి.. అప్పుడే నిర్మాత బాగుంటారు. ఇండస్ట్రీ బాగుంటుంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ని మన దర్శకులు ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు చిరు. మెగాస్టార్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!
ఇల్లు, ఉద్యోగం, పెళ్లి.. 2026లో అదృష్టం అంటే వీరిదే!