Chiranjeevi’s ‘Acharya’ teaser: చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌ వచ్చేసింది.. దుమ్ములేపిన మెగాస్టార్..

ఎప్పుడా.. ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' టీజర్ వచ్చేసింది. వెయిట్ చేయిస్తే చేయించారు కానీ అదిరిపోయే కిక్ ఇచ్చారు దర్శకుడు కొరటాల.

Chiranjeevi's 'Acharya' teaser: చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌ వచ్చేసింది.. దుమ్ములేపిన మెగాస్టార్..
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 6:19 AM

Chiranjeevi’s ‘Acharya’ teaser: ఎప్పుడా.. ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న సమయం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ టీజర్ వచ్చేసింది. వెయిట్ చేయిస్తే చేయించారు కానీ అదిరిపోయే కిక్ ఇచ్చారు దర్శకుడు కొరటాల. మెగాస్టార్ మార్క్ ఇమేజ్, గ్రేస్ రెండూ ఈ టీజర్‌లో కనిపిస్తున్నాయి. కొరటాల శివ-చిరంజీవి కాంబినేషన్‌పై అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా టీజర్ అదరగొట్టింది. విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.  “పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో” అని మెగాస్టార్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక టీజర్ ఇంట్రోకు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ‘సిద్ధ’ అనే యువకుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే షూటింగ్‌లో కూడా జాయిన్ అయ్యారు. ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ.. ధర్మస్థలి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇందులో దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో నటిస్తున్నట్లు అర్థమవుతోంది. దేవాలయాలు  కొందరి కబంధ హస్తాల్లో పడి ఎలా చారిత్రకతను కోల్పోతున్నాయి..? దీనికి ఆచార్య ఎలాంటి ముగింపు పలకిడానేదే ఈ సినిమా కథాశంగా తెలుస్తోంది.

Also Read:

Prabhas : రామగుండం కమిషనర్ కార్యాలయంలో ప్రభాస్.. భారీగా తరలివచ్చిన అభిమానులు..